Begin typing your search above and press return to search.
అమెరికాలో ఇండియన్లకు వ్యతిరేకంగా కరపత్రాలు
By: Tupaki Desk | 6 Nov 2017 5:30 AM GMTఅగ్రరాజ్యం అమెరికాలో మరోమారు కలకలం చోటుచేసుకుంది. అయితే ఇది ఇటీవల జరుగుతున్నట్లుగా ఉగ్రవాదుల దాడుల వల్ల కాదు...కొద్దికాలం క్రితం కొనసాగి సద్దుమణిగిన జాతివిద్వేషాల నిరసనలు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక శ్వేతజాతీయుల్లో జాత్యాహంకారం పెరిగిపోతోందని, వలసవచ్చిన వారిని ప్రతిఘటిస్తున్నారని భావించేలా గతంలో కొన్ని సంఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే అవి సద్దుమణుగుతున్న తరుణంలో మరోమారు అదే తరహా సంఘటనలు జరిగాయి. అమెరికాలో కీలక నగరమైన న్యూజెర్సీలో ఈ పిలుపుతో ఏకంగా కరపత్రాలు ప్రచురించారు.
న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలో ‘ఎడిసన్ నగరాన్ని మరోసారి గొప్పగా మారుద్దాం’ అనే అర్థంతో కరపత్రాలు దర్శనమిచ్చాయి. ఏసియన్-అమెరికన్ స్కూల్ బోర్డు సభ్యులుగా ఉన్న ఇండో అమెరికన్ ఫాల్గుణి పటేల్ - చైనీస్ అమెరికన్ జెర్రీ షీలను టార్గెట్ చేస్తూ....ఈ ఇద్దరినీ బహిష్కరించాలని ఈ కరపత్రాల్లో పిలుపునిచ్చారు. భారతీయులు - చైనీయులు తమ నగరాన్ని ఆక్రమించుకుంటున్నారని ఆక్రోశం వ్యక్తం చేస్తూ....``, జరిగింది చాలు.. ఇకనైనా మా నగరాన్ని వదిలేయాలి`` అనే సారాంశంతో ఈ కరపత్రాలు ఎడిసన్ నగరంలో దర్శనమివ్వడం అక్కడి చైనా - భారతీయుల్లో తీవ్ర ఆందోళనకు కారణంగా మారింది. ఈ విద్వేష ప్రచారం ఎక్కడికి దారితీస్తుందో అని ఆవేదన చెందుతున్నారు.
మరోవైపు ఇదే తరహా జాతి విద్వేషకర సంఘటన కూడా మరొకటి చోటుచేసుకుంది. ఇక, వాషింగ్టన్ కి చెందిన కెంట్రిడ్జ్ హైస్కూలులో 14ఏళ్ల సిక్కు విద్యార్థిపై దాడి జరిగింది. తలపాగా ధరించిన అతనిపై తోటి విద్యార్థి దాడి చేసి పిడి గుద్దులు గుప్పించాడు. ఈ ఘటనలో సదరు విద్యార్థికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ రెండు సంఘటనలు అమెరికాలో సంచలనంగా మారాయి. మరోమారు విద్వేషం జడలు విప్పుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.