Begin typing your search above and press return to search.
భారత్ పై జాత్యహంకార జోక్.. సారీ చెప్పిన యూకే మిలియనీర్
By: Tupaki Desk | 10 Dec 2022 12:30 AM GMTలండన్‌లోని అతిపెద్ద స్వతంత్ర ప్లంబింగ్ కంపెనీ పిమ్లికో ప్లంబర్స్ వ్యవస్థాపకుడు, బ్రిటిష్ మిలియనీర్ చార్లీ ముల్లిన్స్ భారతీయులపై జాత్యహంకార వ్యాఖ్య చేసినందుకు క్షమాపణలు చెప్పారు. "భారత్ ఎప్పుడూ ప్రపంచ కప్‌ను ఎందుకు గెలవలేదు? ఎందుకంటే వారు ఒక కార్నర్ వచ్చిన ప్రతిసారీ, వారు దానిపై దుకాణాన్ని నిర్మిస్తారు," అని ముల్లిన్స్ ఎద్దేవా చేశాడు. అయితే దీనిపై భారతీయుల నుంచి ఇతర వర్గాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కితగ్గాడు. "నేను చాలా చింతిస్తున్నాను," అని ముల్లిన్స్ తర్వాత భారతదేశం గురించి తన వ్యాఖ్యలపై సారీ చెప్పాడు.
లండన్‌లోని అతిపెద్ద స్వతంత్ర ప్లంబింగ్ కంపెనీ అయిన 70 ఏళ్ల పిమ్లికో ప్లంబర్స్ వ్యవస్థాపకుడు చార్లీ వార్షిక వేడుకకు అతిథిగా హాజరయ్యారు. "బ్రిటీష్ కర్రీ అవార్డ్స్‌కు అతిథిగా వచ్చినందుకు నేను నిజంగా గౌరవంగా భావిస్తున్నాను. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల కోసం మంచి పని చేస్తున్న ఇలాంటి మనస్సు గల కష్టపడి పనిచేసే పారిశ్రామికవేత్తల సమూహంతో అద్భుతమైన సాయంత్రం గడిపాను" అని ముల్లిన్స్ మాట్లాడారు.
ఈ క్రమంలోనే భారత్ పై నోరుపారేసుకున్నాడు. 'భారత్ ఎప్పుడూ ప్రపంచకప్ ఎందుకు గెలవలేదు? ఎందుకంటే వారు ఒక స్టేజీకి వచ్చిన ప్రతిసారీ ఓడిపోయి దుకాణం బంద్ చేస్తారు"అని ముల్లిన్స్ నోరుపారేసుకున్నాడు.
ప్లంబింగ్ సేవలకు గాను 2015 న్యూ ఇయర్స్ ఆనర్స్ లిస్ట్‌లో అవార్డు అందుకున్న ముల్లిన్స్ అప్పుడు కూడా ట్విట్టర్‌లోకి ఆసియన్లపై విమర్శలు చేశారు. నిర్వాహకులను పిలిచి, వారి అవార్డులలో ఎక్కువ భాగం ఆసియాకు ప్రాతినిధ్యం ఇచ్చారని విమర్శించారు.
ఈ జోక్ పై భారతీయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు అందరిలోనూ కోపం తెప్పించాయి. అది అస్సలు సరైంది కాదని ముల్లిన్స్ ను ట్యాగ్ చేసి భారతీయులు విమర్శలు గుప్పించారు. భారతీయ వారసత్వం, భారతీయ సమాజం మరియు తన కంటే ముందు బ్రిటన్‌కు వచ్చిన వారి గురించి గర్వపడుతున్నానని, అందుకే ఇలాంటి విషయాలపై తాను మౌనంగా ఉండలేమని పలువురు ప్రముఖ భారతీయ న్యూస్ యాంకర్స్ కూడా ముల్లిన్స్ పై విమర్శలు గుప్పించారు.
"మేము విమర్శలకు అతీతం కాదు . కానీ మేము నేర్చుకోవడానికి మరియు ఎదగడానికి సిద్ధంగా ఉన్నాము, "అని ముల్లిన్స్ సారీ చెప్పాడు. ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.