Begin typing your search above and press return to search.

రాధా నాత‌మ్ముడు.. కొడాలి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   26 Dec 2022 9:06 AM GMT
రాధా నాత‌మ్ముడు.. కొడాలి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
వంగ‌వీటి రాధా పై మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు కొడాలి నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాధాను ఓన్ చేసుకునే ప్ర‌య‌త్నం చేశారు. అయితే.. తాను ఓన్ చేసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నా రు. ఆయ‌న త‌మ కుటుంబ స‌భ్యుడేన‌ని చెప్పారు. ఆదివారం రాత్రి.. విజ‌య‌వాడ శివారు ప్రాంతం నున్న‌లో రంగా విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా రాధా వెంట ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ, నాని ఇద్ద‌రూ పాల్గొన్నారు.

నాని స్వ‌యంగా రంగా విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా నాని మాట్లాడుతూ.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వంగవీటి రంగాపై ప్ర‌శంస‌లు గుప్పించారు. ఆయ‌న‌ను ఓ వ్యక్తి కాదని, కాపు సామాజిక వర్గానికి చెందిన ఓ శక్తిగా అభివ‌ర్ణించారు. రంగా ఎదుగుదలను అడ్డుకోవడానికి రాజకీయ ప్రత్యర్థులు ఎంతో ప్రయత్నించారని, అది సాధ్యం కాకపోవడంతో ఆయ‌న‌ను హ‌త్య చేశార‌ని ప‌రోక్షంగా టీడీపీపై నిప్పులు చెరిగారు.

భౌతికంగా రంగాను దూరం చేసినప్పటికీ- ఆయన అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని కొడాలి నాని చెప్పారు. విజయవాడ రాజకీయాలను కనుసన్నల్లో వంగవీటి రంగా శాసించారని, ప్రభుత్వాన్ని ఎదిరించి నిలిచారని అన్నారు. నిరాహార దీక్ష‌లో ఉన్న రంగాను తెల్ల‌వారుజామున అత్యంత పాశవికంగా హత్య చేయించారని ధ్వజమెత్తారు.

అయితే.. రాధాను త‌మ్ముడు అని సంబోధించ‌డం గ‌మ‌నార్హం. "తన తమ్ముడు రాధా బాబు అడిగితే ఆయన అభిమానులు వెయ్యి ఇళ్లను ఖాళీ చేసి ఆయనకు ఇస్తారు" అని ప్రశంసించారు. మొత్తంగా చూస్ఏత‌.. అనూహ్యంగా రంగా వ‌ర్థంతి నాడు.. ఏపీ రాజ‌కీయాలు వేడెక్క‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.