Begin typing your search above and press return to search.
అర్ధరాత్రి చంద్రబాబు ఇంటికి వెళ్లిన రాధా ... దేనికోసమంటే ?
By: Tupaki Desk | 9 Jan 2020 8:31 AM GMTమాజీ ఎమ్మెల్యే , ప్రస్తుత టీడీపీ నేత వంగవీటి రాధా ..గత రాత్రి ఉండవల్లి లోని చంద్రబాబునాయుడు ఇంటికి వెళ్లారు. ఎన్నికల ఫలితాల తరువాత పార్టీ పరంగా కానీ , వ్యక్తిగతంగా కానీ అంత యాక్టీవ్ గా లేని రాధా ఒక్కసారిగా బుధవారం అర్ధరాత్రి చంద్రబాబు ఇంటి వద్ద ప్రత్యక్షం కావడం తో టీడీపీ నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. గత ఎన్నికల ముందు వరకు వైసీపీ లో ఉండి విజయవాడ సెంట్రల్ టికెట్ కోసం హంగామా చేసి , చాలా కాలం పాటు సందిగ్ధంలో కొనసాగి ఆ తర్వాత టీడీపీ తీర్ధం పుచ్చుకున్న రాధా గత ఎన్నికల ఫలితాలతో షాక్ తిన్నారు. ఈయన మధ్యలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో రెండుసార్లు భేటీ అవ్వడం తో అప్పట్లో రాధా జనసేన లోకి వెళ్ళబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి కానీ, అయన జనసేనలో కూడా చేరకుండా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.
ఆ తరువాత రాష్ట్రం లో టీడీపీ ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ రాధా ఎక్కడా కనిపించలేదు. అలాగే అమరావతి లో రైతులకి మద్దతు తెలుపుతూ చేసిన పోరాటం లో కూడా రాధా పాల్గొనలేదు. కానీ , రాధా సడన్ గా నిన్న అర్ధరాత్రి ఉండవల్లి లోని చంద్రబాబు ఇంటివద్ద ప్రత్యక్షమై పార్టీ శ్రేణులకు షాకిచ్చారు. అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బస్సు యాత్ర సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ను పోలీసులు అరెస్టు చేసి విడుదల చేశారు.
ఈ నేపధ్యంలో అక్కడ ఉద్రిత వాతావరణం నెలకొంది. చంద్రబాబు అరెస్ట్ గురించి తెలియడంతో.. వంగవీటి రాధా ఉండవల్లిలోని నివాసానికి వెళ్లారు. అక్కడ మాజీ మంత్రి లోకేష్‌తో పాటూ టీడీపీ నేతల్ని కలిశారు.. తాజా రాజకీయా పరిణామాలపై కొద్ది సేపు మాట్లాడారు రాధా తన సంఘీభావాన్ని తెలిపారు. కొద్ది రోజులు గా పార్టీ కి దూరంగా ఉన్న ఆయన.. మళ్లీ చంద్రబాబు ఇంటికి రావడంతో టీడీపీ శ్రేణులు కూడా ఆసక్తిగా చూశారు. రాధా మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారనే ప్రచారం మొదలయ్యింది. అయితే చంద్రబాబు ఇంటికి వచ్చిన రాధా చంద్రబాబు ను కలవలేక పోయారు. దీంతో లోకేశ్, ఇతర నాయకులతో కాసేపు మాట్లాడి వెళ్లి పోయారు.