Begin typing your search above and press return to search.
2 రోజుల్లో ఆయన సంపాదించింది 4300 కోట్లు
By: Tupaki Desk | 7 April 2017 2:21 PM GMTభారత్‌లో చాలామంది వ్యాపార.. పారిశ్రామిక దిగ్గజాలు ఉన్నా.. కొద్దిరోజులుగా ఒక పేరు మాత్రం పదే పదే మారుమోగుతోంది. అవెన్యూ సూపర్ మార్ట్స్ షార్ట్ కట్‌లో డీమార్ట్ సూపర్ మార్కెట్ పేరుతో చెన్ మార్కెట్ స్టోర్ల షేర్లు సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తోంది. ఈ కంపెనీ యజమాని అయిన రాధాకిషన్ దమానీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. స్టాక్ ఎక్సేంజ్‌లోకి అడుగు పెట్టిన రెండు.. మూడు రోజుల వ్యవధిలోనే అనిల్ అంబానీ ఆస్తిని దాటేసిన ఆయన.. తాజాగా మరో సంచలనం సృష్టించారు. కేవలం 48 గంటల వ్యవధిలో ఆయన ఆస్తికి మరో రూ.4300 కోట్లు జతయ్యాయి.
ఎలా సాధ్యమైందంటే.. ఇటీవల ట్రేడింగ్ మొదలెట్టిన ఆయన షేర్లు తారాజువ్వ మాదిరి దూసుకెళుతున్నాయి. లిస్టింగ్ డే రోజే ఏకంగా 114 శాతం లాభంతో ఎగిసిన ఆయన షేర్లు అంతకంతకూ పెరుగుతున్నాయే కానీ తగ్గటం లేదు. రూ.299 లిస్టింగ్‌కు వచ్చిన ఈ షేర్ ఇప్పటికి 2.4 రెట్ల లాభంతో దూసుకెళ్తున్నాయ్. తొమ్మిది రాష్ట్రాలు.. ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో 118 స్టోర్లను నిర్వహిస్తున్నారు. ఇందులో ఒక్క స్టోర్ కూడా నష్టాల్లో లేకపోవటం విశేషంగా చెప్పొచ్చు.
శుక్రవారం ట్రేడింగ్ కి అయితే 13 శాతం పెరిగి.. మార్కెట్లో మెరుపులు మెరిపించాయి. తాజా ట్రేడింగ్‌లో ఈ షేర్ రూ.714 గరిష్ఠ స్థాయిని తాకింది. దీంతో.. దమానీ ఆయన కుటుంబం ఆస్తుల విలువ ఏకంగా రూ.4300 కోట్లు జత చేరాయి. దమానీ కుటుంబానికి అవెన్యూ సూపర్ మార్ట్స్‌లో 82.2 శాతం స్టాక్స్ కలిగి ఉండటం గమనార్హం. తాజాగా పెరిగిన షేర్ ధరతో దమానీ 20వ అత్యంత భారతీయ ధనవంతుడిగా నిలవటమేకాదు.. టాప్ 500 వరల్డ్ బిలియనీర్ల జాబితాలో ఆయనకు చోటు దక్కింది. మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం.. ఈ షేర్ విలువ మరింత పెరిగే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/