Begin typing your search above and press return to search.
ఈ ‘రాధమ్మ’ ముందు ‘అమ్మ’ బలాదూర్
By: Tupaki Desk | 15 Dec 2015 4:35 AM GMTఒకరేమో సాదాసీదా స్త్రీ. మరొకరు అసాధారణ శక్తి సంపన్నురాలైన మహిళ. ఒకరు తన వరకు తాను మాత్రమే సాయం చేయగలరు. కానీ.. మరొకరు తలుచుకుంటే తమిళనాడు రాష్ట్రం మొత్తం కదులుతుంది. వీరిలో మొదటి వ్యక్తి అరవై ఏళ్ల రాధ కాగా.. ఇంకొకరు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత. వయసులో ఇద్దరూ కుడి ఏడమ తప్పించి భారీ వ్యత్యాసమైతే పెద్దగా లేదు. నిన్నమొన్నటివరకూ ఎవరికి తెలీని రాధ.. ఇప్పుడు రాధమ్మగా మారి.. సోషల్ నెట్ వర్క్స్ లో ఓవర్ నైట్ హీరో అయిపోయారు. లక్షలాది మందికి ఇప్పుడామె ఆదర్శంగా మారిపోయారు.
పని పట్ల కమిట్ మెంట్ తో పాటు.. తన ధర్మాన్ని నిర్వర్తించటం కోసం ఎంతటి ఇబ్బందినైనా ఎదుర్కోవటానికి సిద్ధమైన తీరు రాధమ్మలో కనిపించి ముచ్చటేస్తుంది. మరోవైపు.. అపరిమితమైన శక్తి సామర్థ్యాలున్నప్పటికీ.. పెద్దగా రియాక్ట్ కాని తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత కనిపిస్తారు. ఇక.. ఇద్దరికి సంబంధించి మరో విషయంలో పోల్చి అసలు కథలోకి వెళ్లిపోదాం. రాధమ్మ తన గురించి ప్రచారానికి అస్సలు ఇష్టపడకపోతే.. అమ్మ లాంటి జయలలిత మాత్రం ప్రచారానికి ప్రాణం ఇస్తారు. అందుకోసం ఎంతకైనా రెఢీ అని బరితెగిస్తారు కూడా. ఇక.. రాధమ్మ వ్యవహారంలోకి వెళితే..
చెన్నై మహానగరంలో పాలు సప్లై చేసే మహిళ రాధ. 60 ఏళ్ల వయసున్న ఆమెకు ఇద్దరు కొడుకులు. ఇద్దరూ ప్రయోజనకులై మంచి స్థానంలోనే ఉన్నారు. అయినప్పటికీ రాధమ్మ నిత్యం ఉదయం 4 గంటలకు తన దైనిక చర్య ప్రారంభిస్తుంది. పాలు తీసుకొని.. తాను సప్లైయ్ చేయాల్సిన వారందరికి పంపిణీ చేస్తారు. ఇలా క్రమం తప్పకుండా ఇళ్లకు రోజూ పాలు సప్లై చేస్తుంటారు. డిసెంబరు 2న చెన్నై మహానగరాన్ని భారీ వర్షం.. వరద నీరు ముంచెత్తిన వేళ కూడా యథావిధిగా తన టైంకు లేచిన ఆమె.. భారీ వర్షంలో మోకాళ్లకు పైకే వచ్చిన వరద నీటి మధ్యనే తాను నిత్యం పాలు సప్లై చేసే ‘‘శ్రీవిద్య అపార్ట్ మెంట్స్’’కి వెళ్లి వారికి పాలు పోసి వచ్చారు.
ఆ దృశ్యాన్ని చూసిన ఒకరు ఫోటోలు తీసి.. ఆమెకు సంబంధించిన సమాచారం సేకరించటంతో.. ఈ వ్యవహారం బయటకు వచ్చింది. ఈ విషయాన్ని ప్రముఖంగా చెప్పుకుంటూ సోషల్ మీడియోలోకి రావటంతో.. ఆమె సాహసం బయటకు వచ్చింది. దీంతో.. రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో ఆమె హీరోగా మారిపోయారు. ఎందుకిలా అంటే.. తన కోసం నమ్మకంగా ఎదురుచూస్తుంటారని.. అలాంటప్పుడు వారి నమ్మకాన్ని చెడగొట్ట కూడదు కదా అని బదులిస్తారు. ఇప్పుడు చెప్పండి.. ‘‘అమ్మ’’గా చెప్పుకునే ఆవిడతో పోలిస్తే.. ‘‘రాధమ్మ’’ కోటి రెట్లు బెటర్ కాదా..?