Begin typing your search above and press return to search.
వీహెచ్‌పీ నేతకు రాధేమా ప్రపోజ్ చేసిందట!
By: Tupaki Desk | 8 Sep 2017 1:52 PM GMTదేశంలో వివాదాస్పద మత గురువుల వ్యవహారం ఇప్పుడు పీక్స్ కు వెళ్లినట్టే ఉంది. డేరా బాబా గుర్మీత్ సింగ్ కు సీబీఐ ప్రత్యేక కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన దరిమిలా... దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న వివాదాస్పద బాబాల ద్వారా తాము ఏ తరహా ఇబ్బందులు ఎదుర్కొన్నామన్న విషయాలను పలువురు బయటపెడుతున్నారు. ఈ క్రమంలో ముంబైని కేంద్రంగా చేసుకుని తనను తాను మాతగా అభివర్ణించుకుని పెను వివాదం రేపిన రాధేమా అలియాస్ సుఖ్వీందర్ కౌర్ కు సంబంధించిన మరో ఆసక్తికర విషయం వెలుగు చూసింది. తనను తాను దైవంగా ప్రచారం చేసుకున్న రాధేమా... సినిమా తారలను తలపించేలా చిట్టిపొట్టి డ్రెస్సులు వేసుకుని అశ్లీల నృత్యాలు చేస్తూ ఆమె ఇప్పటికే పెను వివాదానికి తెర తీశారు.
ఈ వ్యవహారంపై గతంలో పెద్ద దుమారమే రేగినా... రాధేమా తనకేమీ పట్టనట్టుగానే వ్యవహరించిందన్న వాదన లేకపోలేదు. తాజాగా వెలుగులోకి వచ్చిన రాధేమా ఘన కార్యం వివరాల్లోకెళితే... తనను తాను దైవాంశ సంభూతురాలిగా చెప్పుకునే రాథేమా.. ప్రేమ పేరిట తనను తీవ్రంగా వేధించినట్టు విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ) సభ్యుడు సురేందర్ మిట్టల్ ఆరోపించారు. ‘ఐ లవ్ యూ’ అంటూ తనను అనేక రకాలుగా ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించేదనీ... తీరా ఆమె ముందుకు వెళితే నానా శాపనార్థాలు పెట్టేదని ఆయన ఆరోపించారు.
ఈ వ్యవహారంపై సురేందర్ ఏమన్నారంటే... *ఇది రెండేళ్లనాటి మాట. ఈ విషయం మీడియాలో కూడా విస్తృతంగా ప్రసారం అయింది. ఈ వేధింపులపై ఆమెకు నా తరపు న్యాయవాది నోటీసు కూడా జారీచేశారు. ఇప్పుడు ఆమెపై కోర్టు ధిక్కార నోటీసులు కూడా ఫైల్ చేశాం. హైకోర్టు ఆమెపై చర్యలు తీసుకుని న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాను. ప్రత్యేకించి బాబాలు, స్వామీజీల పేరిట నకిలీ గుర్తింపుతో దందాలు నడుపుతున్న వాళ్లను వెలుగులోకి తీసుకురావాలి* అని మిట్టల్ పేర్కొన్నాడు. ఈ విషయంలో రాథేమాపై పంజాబ్ హర్యానా ఉమ్మడి హైకోర్టు గత మూడు రోజుల క్రితం కొరడా ఝళింపించిన సంగతి తెలిసిందే. సురేందర్ మిట్టల్ ఫిర్యాదు మేరకు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పంజాబ్ పోలీసులను మంగళవారం హైకోర్టు ఆదేశించింది.