Begin typing your search above and press return to search.
రజినీ రూట్ లోనే రాధిక ప్రయాణం
By: Tupaki Desk | 1 March 2016 7:30 PM GMTసౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఏం చెబితే.. నేను అంతే అంటున్నారు సీనియర్ నటి రాధిక. మరో సీనియర్ హీరో శరత్ కుమార్ భార్య అయిన రాధిక.. రజినీ మాటే నా మాట, రజినీ రూటే నా రూటు అని చెప్పడం ఆశ్చర్యమే అయినా.. ఆ మాట స్వయంగా తనే చెప్పడం విశేషం. తెలుగు - తమిళ్ చిత్రాల్లో హీరోయిన్ గా వెలిగిపోయిన ఎక్స్ పీరియన్స్ రాధికకు ఉంది. అప్పుడప్పుడూ వెండితెర పైనా, ఎక్కువ కాలం బుల్లితెర పైనా కనిపిస్తున్నారీమె.
రాధిక భర్త సమత్తువ మక్కళ్ కచ్చి అనే రాజకీయ పార్టీ అధ్యక్షుడు కూడా. రీసెంట్ గా ఓ సినిమా షూటింగ్ కోసం పళని వెళ్లిన రాధిక.. అక్కడ సుబ్రమణ్యస్వామిని దర్శించుకున్నాక.. మీడియా జనాలతో ముచ్చట్లాడారు. భర్త రాజకీయాల్లో ఉండడంతో.. మీ రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడనే ప్రశ్న ఎదురైంది రాధికకు. దీనికి దిమ్మ దిరిగిపోయే ఆన్సర్ ఇచ్చారామె. 'ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేను ఎప్పుడొస్తానో నాకే తెలీదు. ఈ ప్రశ్నకు రజినీకాంత్ ఇచ్చే సమాధానమే.. నాది కూడా. ఎలా వస్తాను, ఎప్పుడొస్తాను లాంటి ప్రశ్నలకు కాలమే ఆన్సర్ చెబుతుంది' అన్నారు రాధిక.
ఇక భర్త పార్టీ వ్యవహారాల్లో తనేం తల దూర్చనని చెప్పారు రాధిక. త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనుండడంతో.. కూటమి కట్టే వ్యవహారాలు, పోటీ వంటి విషయాలను శరత్ కుమార్ చూసుకుంటారని.. తనేం తల దూర్చడం లేదని చెప్పారు సీనియర్ నటి రాధిక.