Begin typing your search above and press return to search.
విజయకాంత్ కు టెన్షన్ వస్తే అలా చేస్తారా?
By: Tupaki Desk | 22 Feb 2016 4:21 AM GMTసీనియర్ నటి రాధిక శరత్ కుమార్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొహమాటం అన్నది లేకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం.. సూటిగా చెప్పేయం లాంటివి రాధికకు అలవాటు. తాను మాట్లాడాలనుకున్న విషయం మీద శషభిషలకు అవకాశం ఇవ్వకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేసే తత్వం ఆమె సొంతం. తాజాగా ఆమె గీత రచయిత పా.విజయ్ హీరోగా నటిస్తున్న చిత్రానికి సంబంధించిన ప్రచారచిత్రాన్ని చెన్నైలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాధిక నోటి వెంట ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చాయి.
ఆ సినిమా దర్శకుడు ఎస్ ఏ చంద్రశేఖర్ గురించి చెబుతూ.. ‘‘ఆయనకు కోపం ఎక్కువ. అన్నీ పక్కాగా ఉండాలనుకుంటారు. టైం విషయంలో చాలా కచ్ఛితంగా ఉంటారు. కోపం వస్తే ఎవర్నది కూడా చూసుకోకుండా కొట్టేస్తారు. ఆయన్నుంచి తిట్లు.. దెబ్బల నుంచి తప్పించుకున్నది నేనొక్కదాన్నే అని చెబుతారు. చివరకు డీఎండీకే అధినేత విజయకాంత్ కూడా చివాట్లు తిన్నారు’’ అంటూ అసలు విషయాన్ని చెప్పేసింది.
ఇక్కడివరకూ చెప్పిన రాధిక మరిన్ని వివరాలు చెప్పకుండా ఉన్నా బాగుండేదేమో. ఒకవేళ అదే జరిగితే ఆమె రాధిక అవ్వరుకదా. డీఎండీకే పార్టీ అధినేతగా ఉన్న విజయకాంత్ కు కోపం వస్తే.. పక్కనున్న వారినెవరినో ఒకరిని కొట్టేస్తుంటారని.. టెన్షన్ వస్తే ఆయన పక్కనున్నోళ్లకు దెబ్బలు తప్పవంటూ సదరు అధినేత గురించిన సీక్రెట్ చెప్పేశారు. అయితే.. విజయకాంత్ కు వచ్చిన అలవాటు దర్శకుడు చంద్రశేఖర్ నుంచే వచ్చిందన్న విషయం తనకు అర్థమైందని చెప్పుకొచ్చారు.
మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. తనను కాబోయే ముఖ్యమంత్రిగా కొందరు పిలుస్తున్నారని.. తనకు సీఎం కావాలన్న ఆలోచన అస్సలు లేదని.. ఇప్పటికే ముఖ్యమంత్రి పదవి కోసం ఏడుగురు పోటీ పడుతున్నారని.. తాను ఎనిమిదో వ్యక్తిని కావటం తనకు ఇష్టం లేదంటూ కుండ బద్ధలు కొట్టేశారు. ఆమె సంగతి తర్వాత.. ఎన్నికల వేళ.. విజయ్ కాంత్ గురించిన సీక్రెట్ ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.