Begin typing your search above and press return to search.

పాప కోసం మ్యాచ్‌ ఆపేసిన నాదల్!

By:  Tupaki Desk   |   30 Sep 2016 11:35 AM GMT
పాప కోసం మ్యాచ్‌ ఆపేసిన నాదల్!
X
తాజాగా జరిగిన ఒక సంఘటనను క్రీడా స్ఫూర్తి అనాలో లేక మానవత్వపు మచ్చుతునక సన్నివేశంగా భావించాలో కానీ... ఉన్నట్లుండి గల్లంతైన ఒక బిడ్డ కోసం ఆవేదనతో వెతుకుతున్న అమ్మకోసం తన ఆటను మధ్యలో ఆపేశాడు టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్. ఇలా ఆటను మధ్యలోనే ఆపడం వల్ల తల్లీబిడ్డలు కలుసుకునేందుకు తనవంతు సాయం చేశాడనే చెప్పాలి. ప్రస్తుతం సోషల్ నెట్ వర్క్స్ లో వైరల్‌ గా మారింది ఈ సంఘటన.

వివరాళ్లోకి వెళితే... ఒక యువ ఆటగాడికి జతగా టెన్నిస్ ఉద్ధండులు జాన్ మెకెన్రో, కార్లోస్ మోయాలతో తలపడుతున్నాడు స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్. పాయింట్ సాధించిన ఆనందంలో ఉన్న నాదల్ సర్వీస్ కు సిద్ధమవుతున్నాడు. అప్పటికే చుట్టూ వందల మంది అభిమానులుండి, ఆ ఎగ్జిబిషన్ మ్యాచ్ సీరియస్‌ గా సాగుతోంది. సరిగ్గా అదే సమయంలో తన ఎడమచేతి వైపు ప్రేక్షకుల్లో చిన్నపాటి అలజడి మొదలైంది. ఏంటా అని సర్వీస్ ఆపేసి చూస్తుండిపోయాడు నాదల్.

ఆ జనాల్లోని ఒక మహిళ తన చిన్నారి ప్రేక్షకుల్లో తప్పిపోందంటూ కన్నీటి పర్యంతమవుతోంది. దీంతో ఆమె వెతుకుతున్న పాప పేరు అడిగి తెలుసుకున్న వారంతా "క్లారా" అంటూ పిలవడం ప్రారంభించారు. వెంటనే కేవలం సెకన్ల వ్యవధిలోనే క్లారా కనిపించింది. అప్పటికే తప్పిపోయిన విషయం తెలుసుకున్న బిడ్డ ఆ అరుపులకు తిరిగి చూసింది. ఆ సమయంలో ఏడుస్తున్న బిడ్డను చూసిన తల్లి పరుగున వెళ్లి హత్తుకుంది. అనంతరం తల్లీ బిడ్డ కలుసుకోవడంతో ప్రేక్షకులంతా చప్పట్లు కొట్టి హర్షం ప్రకటించారు. ఇక నాదల్ ప్రత్యర్థి, మెకన్రో కూడా ఉద్వేగం పట్టలేకపోయాడు. కళ్లల్లో సన్నగా అలముకున్న కన్నీటిని తుడుచుకుని అనంతరం మ్యాచ్ కొనసాగించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/