Begin typing your search above and press return to search.

'జ‌ల్లిక‌ట్టు' స్పూర్తితో పార్టీ పెట్ట‌నున్న న‌టుడు

By:  Tupaki Desk   |   2 Feb 2017 7:05 AM GMT
జ‌ల్లిక‌ట్టు స్పూర్తితో పార్టీ పెట్ట‌నున్న న‌టుడు
X
త‌మిళుల సంప్ర‌దాయ క్రీడ జ‌ల్లిక‌ట్టుపై నిషేధం ఎత్తివేత ఎపిసోడ్ దేశవ్యాప్తంగా ఉత్కంఠ‌ను రేకెత్తించిన సంగ‌తి తెలిసిందే. జ‌ల్లిక‌ట్టుపై నిషేధం విధింపును నిరసిస్తూ తెర‌మీద‌కు వ‌చ్చిన వారు రాజ‌కీయాల్లోకి రానున్నార‌ని క‌నిపిస్తోంది. మల్టిటాలెంట్‌ తో సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న లారెన్స్‌ త్వరలో రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారని అంటున్నారు. అతడు కూడా ఓ పార్టీని పెట్టబోతున్నాడని తెలుస్తోంది. ఈ విషయంపై రాఘవ లారెన్స్‌ కూడా ఇటీవల తన అభిప్రాయాన్ని చెప్పాడు. ప్రజల సమస్యల కోసం రాజకీయ పార్టీని స్థాపించడానికైనా సిద్ధమని లారెన్స్‌ తెలిపాడు. దీంతో త్వ‌ర‌లో లారెన్స్ రాజ‌కీయ పార్టీ ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని త‌మిళ‌నాడు సినీ వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.

తమిళనాట జరిగిన జల్లికట్టు ఆందోళనలపై రాఘవ లారెన్స్‌ అందరికన్నా ముందుగా స్పందించాడు. కావాలంటే నిరసనకారుల కోసం తాను కోటి రూపాయలు డబ్బును కూడా ఇస్తానని ప్రకటించాడు. అంతేకాకుండా ఆరోగ్యం బాగలేకపోయినా, నిరసనలో పాల్గొన్నాడు. మెరీనా బీచ్‌ కు వ‌చ్చిన యువ‌త‌పై పోలీసులు లాఠీచార్జీకి పాల్ప‌డితే లారెన్స్ దాన్ని తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. ఉద్దేశ‌పూర్వ‌కంగా యువ‌కుల‌పై దాడిచేసేందుకు ప్ర‌భుత్వం స‌న్న‌ద్ధ‌మ‌వుతోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శాంతియుతంగా ఆందోళ‌న చేస్తున్న వారిని అణిచివేసేందుకు ప్ర‌య‌త్నాలు చేశార‌ని ఈ స‌మ‌యంలో ప్ర‌భుత్వం క‌నీస నిబంధ‌న‌లు కూడా పాటించ‌లేద‌ని మండిప‌డ్డాడు. ఈ నేపథ్యంలో ఆయనకు పెద్దన్నయ్యగా తమిళ యువతలో భారీగా ఇమేజ్‌ వచ్చింది. దీంతోనే అతడు పార్టీని పెట్టబోతున్నట్లు తెలుస్తుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/