Begin typing your search above and press return to search.

టీడీపీకి లాండ్ స్లైడ్ విక్ట‌రీ ఖాయం.. ఆర్ఆర్ఆర్ వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   18 Jan 2023 5:32 AM GMT
టీడీపీకి లాండ్ స్లైడ్ విక్ట‌రీ ఖాయం.. ఆర్ఆర్ఆర్ వ్యాఖ్య‌లు
X
ఏపీలో జ‌ర‌గ‌నున్న 2024 ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ లాండ్ స్లైడ్ విక్ట‌రీతో రికార్డులు బ‌ద్ద‌లు కొట్ట‌డం ఖాయ‌మ‌ని వైసీపీ ఎంపీ, రాజ‌కీయ విశ్లేష‌కుడు ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఉర‌ఫ్ ఆర్ ఆర్ ఆర్ వ్యాఖ్యానించారు. టీడీపీకి క‌నీసంలో క‌నీసం 12 నుంచి 14 శాతం మెజారిటీ ల‌భిస్తుంద‌ని అన్నారు. అదేస‌మ‌యంలో `వైనాట్ 175` నినాదం ఇస్తున్న అధికార పార్టీ వైసీపీకి చావు దెబ్బ‌త‌ప్ప‌ద‌ని చెప్పారు. ఇటీవ‌ల తాను రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌త్యేకంగా ఒక స‌ర్వే చేయించిన‌ట్టు తెలిపారు.

ఉత్త‌రాంధ్ర ప్రాంతంలో వైసీపీ క‌న్నా కూడా టీడీపీ దూసుకుపోతోంద‌ని ర‌ఘురామ చెప్పారు. గోదావ‌రి జిల్లాల్లోను, కృష్ణా, గుంటూ రు, రాయ‌ల‌సీమ జిల్లాల్లోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌న్నారు. మ‌రీ ముఖ్యంగా సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లోనూ.. వైసీపీ కంటే కూడా టీడీపీకి ఆద‌ర‌ణ పెరిగింద‌న్నారు. ఇక్క‌డి ప్ర‌జ‌లు కూడా టీడీపీని కోరుకుంటున్నార‌ని ఆర్ ఆర్ ఆర్ వ్యాఖ్యా నించారు.

ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో టీడీపీకి 12% ఓట్లు, గోదావ‌రి జిల్లాల్లో 14 నుంచి 16%, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 12 నుంచి 14% ఎడ్జ్ క‌నిపిస్తోంద‌ని ర‌ఘురామ తెలిపారు. ప్ర‌కాశం,నెల్లూరు జిల్లాల్లోనూ టీడీపీ 8% ఓటు బ్యాంకుతో లీడ్‌లో ఉంద‌న్నారు.

ఇక‌, అనంత‌పురం, క‌ర్నూలు జిల్లాల్లో 10 నుంచి 12% ఓటు బ్యాంకు, చిత్తూరు, క‌డ‌ప జిల్లాల్లో 6 నుంచి 8% ఓటు బ్యాంకును టీడీపీ సొంత చేసుకుంటుంద‌న్నారు. జ‌న‌సేన‌తో క‌నుక టీడీపీ పొత్తు పెట్టుకుంటే.. ఈ ఫ‌లితాలు మ‌రింత ఎక్కువ‌గా ఉంటాయ‌ని తెలిపారు.

వైసీపీ ప్ర‌భుత్వం 2019 ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీల్లో 98.7 శాతం అమ‌లు చేయ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని విమ‌ర్శించారు. దీంతో వైఎస్సార్‌ కాంగ్రెస్ పై ప్ర‌జ‌ల్లో ఉన్న సానుభూతి పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింద‌న్నారు.

మ‌రోసారి ఈ పార్టీకి ప్ర‌జ‌లు ఓటు వేయ‌బోర‌ని చెప్పారు. దీనికితోడు.. వివేకానంద‌రెడ్డి మ‌ర‌ణం.. దీని వెనుక దాచి నిజాలు వంటివి కూడా వైసీపీకి శాపం కానున్నాయ‌ని వివ‌రించారు. 2019లో ఈ కేసును అడ్డు పెట్టుకుని సానుభూతిని పొందార‌ని.. అయితే.. ఎన్నిక‌ల త‌ర్వాత‌.. బాబాయిని ఎవ‌రు చంపారో.. ప్ర‌జ‌ల‌కు అర్ధ‌మైంద‌ని, ఈ డ్రామాలు ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో సాగ‌వ‌ని వ్యాఖ్యానించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.