Begin typing your search above and press return to search.

ప్ర‌ధాని మోడీకి ఆర్ ఆర్ ఆర్ లేఖ‌.. విష‌యం ఇదే!

By:  Tupaki Desk   |   25 Feb 2022 8:30 AM GMT
ప్ర‌ధాని మోడీకి ఆర్ ఆర్ ఆర్ లేఖ‌.. విష‌యం ఇదే!
X
వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. తాజాగా ప్ర‌ధాని మోడీకి లేఖ సంధించారు. ఏపీలో భీమ్లానాయ‌క్ చిత్రంపై ప్ర‌బుత్వం క‌క్ష క‌ట్టిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని పేర్కొంటూ.. ఆయ‌న ప‌లు అంశాల‌ను లేఖ‌లో ప్ర‌స్తావించారు. సినీ పరిశ్రమతో వ్యవహరిస్తున్న తీరును, అధికారులు వేధింపులు, ఇతర అరాచకాలను మోడీ దృష్టికి తీసుకెళ్లారు. సినీ పరిశ్రమ భ్రష్టు పట్టించేలా వ్యవహరిస్తున్నారని ప్రధానికి లేసిన లేఖలో తెలిపారు.

లేఖ సారాంశం ఇదే!

తెలుగు సినిమా పరిశ్రమపై ఏపీ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోంది. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తు న్న విధానాల వల్ల వేలాది మంది కళాకారులు, వారి కుటుంబాల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. సినిమా పరిశ్రమ అభివృద్ది కోసం దేశవ్యాప్తంగా అటల్ బీహారి వాజ్‌పేయ్ ప్రభుత్వం ఎన్నో పథకాలను, పాలసీలను తీసుకొచ్చింది. అలాంటి పాలసీలను తుంగలో తొక్కే ప్రయత్నం జరుగుతోంది. వ్యక్తిగత కక్షలతో సినిమా ఇండస్ట్రీని చంపే ప్రయత్నం చేస్తోంది.

కోవిడ్ పరిస్థితుల తర్వాత తెలుగు సినిమా పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఓటీటీలు, పైరసీలతో తెలుగు సినిమా మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నిర్మాతలు భారీ బడ్జెట్‌తో దేశం గర్వించే విధంగా సినిమాలను రూపొందిస్తున్నారు. అయ‌తే.. ఏపీ ప్రభుత్వం తెలుగు సినిమా పరిశ్రమపై కక్ష కట్టినట్టు వ్యవహరిస్తోంది. టికెట్ రేట్ల విషయంలో జోక్యం చేసుకొంటూ నిర్మాతలను వేధిస్తోంది. ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వకుండా ఆంక్షలు విధిస్తోంది. థియేటర్లలో 5, 10, 25 రూపాయల టికెట్ రేట్లు పెట్టి నిర్మాతలకు ఇబ్బంది క‌లిగిస్తోంది. దీంతో సినిమా పరిశ్రమకే కాకుండా ఎగ్జిబిటర్లకు, థియేటర్ యాజమన్యాలు, సినీ కార్మికులకు అన్యాయం జరుగుతోంది. అని లేఖ లో వివ‌రించారు.

సినీమా వారిపై ర‌ఘురామ ఫైర్‌

ఏపీ స‌ర్కారుపై కేంద్రానికి లేఖ రాసిన ఆర్ ఆర్ ఆర్‌.. మ‌రోవైపు.. తెలుగు సినీ ఇండ‌స్ట్రీపై నిప్పులు చెరిగారు. వ్యక్తిగత కక్షతో పవన్ కల్యాణ్‌ను సీఎం జ‌గ‌న్‌ టార్గెట్ చేస్తుంటే కనీసం సినిమా పరిశ్రమ నుంచి ఒక్కరు కూడా ముందుకు వచ్చి సపోర్ట్ చేయడం లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఒక కాకి చనిపోతే మిగిలిన కాకులన్నీ గుంపుగా వచ్చి గొడవ చేస్తాయి. ఒక సినిమా పరిశ్రమలో ఉండి.. తొటి నటుడికి అన్యాయం జరుగుతుంటే నోర్లు మూసుకొని ఉన్నారు.. అని పేర్కొన్నారు.

ఏపీలో థియేటర్లపై రెవెన్యూ అధికారులు దాడులు చేస్తున్నారు. కొన్ని చోట్ల థియేటర్లను మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇలా చేస్తే ఏపీలోని ప్రేక్షకులు తెలంగాణకు వచ్చి సినిమా చూస్తారు. తెలంగాణలో టికెట్ కలెక్షన్లు డబుల్ అవుతాయి. ఇలాంటి దారుణాలపై ఓ ఒక్కరు ప్రశ్నించడం లేదు సినిమా ప్రముఖులకు సిగ్గులేదా అని రఘురామరాజు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి ప్రాధేయపడటం కాదు.. సినిమాల్లో మీరు కొడితే వందమంది లేచిపోతారు. అలాంటి స్టామినా ఉన్న మీరు ప్రభుత్వంపై దెబ్బ కొట్టండి అంటూ వ్యాఖ్యానించారు.

మీ సినిమా పరిశ్రమను మీరు కాపాడుకోవాలి. ఓ హీరో సినిమాకు అన్యాయం జరుగుతుంటే మీరంతా ఏకం కావాలి. మీరు ఒకరికొకరు మద్దతు తెలుపుకోవాలి. పోరాడితే పోయేది ఏమీ లేదు. కక్షతో ఒళ్లు మరిచిపోయి ప్రవర్తిస్తున్న ఏపీ ప్రభుత్వం.. ఇలాంటి పనులు మానుకోవాలని సీఎం జగన్‌ను కోరుతున్నాను. ఐదో ఆటకు అనుమతి ఇవ్వండి అని రఘురామరాజు కోరారు.