Begin typing your search above and press return to search.
క్యాసినో వ్యవహారంలో పెద్దలు.. ఆర్ ఆర్ ఆర్ సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 22 Jan 2022 11:30 AM GMTకృష్ణాజిల్లా గుడివాడలో జరిగినట్టుగా టీడీపీ చెబుతున్న క్యాసినో వ్యవహారంపై మంత్రి కొడాలి నాని స్పందించిన విషయం తెలిసిందే. కె-కన్వెన్షన్ తనదేనని ఆయన చెప్పారు. దీనిలో క్యాసినో ఆడారో లేదో తనకు తెలియదని చెప్పారు. అంతేకాదు.. ఆ సమయంలో తాను హైదరాబాద్‌లో కరోనా చికిత్స పొందు తున్నానని అన్నారు. కాబట్టి ఆ సమయంలో ఇక్కడ జరిగిన వాటికి తాను బాధ్యుడిని ఎలా అవుతానని.. చెప్పారు. ఈ క్రమంలోనే ఈ విషయంలో తన పాత్ర ఉందని చెబితే.. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసకుంటానని అన్నారు.
నిజానికి ఎలాంటి విషయాల్లో అయినా.. కొడాలి స్పందన సూటిగా.. సుత్తి లేకుండా ఉంటుందనేది అందరికీ తెలిసిందే. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఆయనకు ఈ కారణంగానే వచ్చిందని కూడా చెబుతారు. అయితే.. ఇప్పుడు క్యాసినో వ్యవహారం ఇంత పెద్ద రచ్చ జరిగిన తర్వాత.. కూడా ఆయన తనకు తెలియదని చెబుతున్నారంటే.. ఇక్కడే ఏదో జరిగి ఉంటుందని అంటున్నారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఉరఫ్ ఆర్ ఆర్ ఆర్. ``మంత్రి కొడాలి నానిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. గతంలో ఆయన పేకాట శిబిరాలకు సంబంధించి.. నిజాలు ఒప్పుకొన్నారు. ఇప్పుడు ఆయన అబద్ధం చెప్పారనడం తప్పు`` అని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. ఇంత పెద్ద ఎత్తున క్యాసినో నిర్వహించారంటే.. ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున ఎవరో వెనుక ఉన్నారనేది స్పష్టంగా తెలుస్తోంది. కొడాలి చేసిన వ్యాఖ్యలను బట్టి.. తన పాత్ర అందులో లేదు. అంటే.. వేరే ఎవరో వెనుక ఉండి ఇదంతా ఆడించారని తెలుస్తోంది. క్యాసినో నిర్వహణ కోసం.. కె-కన్వెన్షన్‌ను అద్దెకు తీసుకున్న `పెద్దలు` మొత్తం అంతా ఆడించి ఉంటారని ఆర్ ఆర్ ఆర్ చెప్పుకొచ్చారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. అనేక సందేహాలు వ్యక్తం చేశారు.
కొడాలి నానిని పాత్రుడిని చేయడం భావ్యం కాదని. దీనివెనుక ఉన్న పెద్దను పట్టుకుని తీరాలని ఆయన అన్నారు. అంటే.. కొడాలి అంత ధైర్యంగా సవాల్ రువ్వారంటే.. ఆయన పాత్రలేదనేది ఆర్ ఆర్ ఆర్ అభిప్రాయం. దీని వెనుక ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఆ పెద్ద ఎవరు? అనేది తెలియాలంటే.. వెయిట్ చేయాలని అంటున్నారు. మరి ఎప్పుడు ఎవరు బయటకు వస్తారో చూడాలి.