Begin typing your search above and press return to search.

వివేకా హత్య కేసులో కొత్త క్యారెక్టర్ ను తెచ్చిన రఘురామ

By:  Tupaki Desk   |   23 Feb 2022 5:33 AM GMT
వివేకా హత్య కేసులో  కొత్త క్యారెక్టర్ ను తెచ్చిన రఘురామ
X
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు నరసాపురం వైసీసీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. తరచూ ఆయన సంధించే ప్రశ్నలు ఏపీ ప్రభుత్వానికి.. సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికి గురి చేస్తుంటాయి. తాజాగా ఆయన గురి వైఎస్ సోదరుడు వైఎస్ వివేకా హత్య కేసు మీద పడింది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ.. ఇప్పటికే పలువురు వాంగ్మూలాలను రికార్డు చేయటం.. వాటికి సంబంధించిన వివరాలు మీడియాలో రావటం తెలిసిందే.

ఇటీవల కాలంలో వెలుగు చేసిన వివరాల్ని చూసినప్పుడు వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీద పలు వేళ్లు చూపేలా పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఈ కేసు విచారణను వేగవంతం చేస్తోంది సీబీఐ. ఇప్పటికే ఈ కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరి వాంగ్మూలాన్ని రెండు సార్లు రికార్డు చేయటం.. గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి భిన్నంగా తాజా వాంగ్మూలం ఉండటం తెలిసిందే. దీంతో.. అసలు నిందితుల్ని సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి వేళ.. వివేకా హత్యను ప్రస్తావిస్తూ ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు.పలు ప్రశ్నల్ని సంధించారు.

వైఎస్ వివేకా హత్య కేసులో శివగామి ఎవరని ఎంపీ రఘురామ ప్రశ్నించారు. బాహుబలి చిత్రంలో శివగామి పాత్ర ఆదేశాల మేరకు బాహుబలిని కట్టప్ప చంపుతారన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే విషయాన్ని గుర్తు చేస్తూ.. వైఎస్ వివేకా హత్యలోనూ.. శివగామి క్యారెక్టర్ ఎవరన్న ప్రశ్నను సంధిస్తున్నారు.

ఇప్పటికే కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి మీద అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ.. రఘురామ సైతం శివగామి ప్రస్తావన తీసుకురావటం ద్వారా.. వైఎస్ వివేకా హత్యలో గుట్టుచప్పుడు కాకుండా కీలక వ్యక్తి ఉన్నారన్న అభిప్రాయం కలిగేలా రఘురామ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పొచ్చు.

ఇప్పటివరకు బయటకు వచ్చిన పలువురి వాంగ్మూలాల ప్రకారం చూస్తే వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఈ హత్యకు సూత్రధారి అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తగ్గట్లే ఇప్పుడు బయటకు వచ్చిన వాంగ్మూలాల సారాంశం ఉంది. అదే సమయంలో గతంలో నిందితుడి ఉంటూ.. ఇటీవల అప్రూవర్ గా మారిన వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలోనూ కొత్త పేర్లు వెలుగు చూడొచ్చంటున్నారు. ఇటీవల ఈ కేసు విచారణలో సీబీఐ స్పీడ్ పెంచిన నేపథ్యంలోనే ఎంపీ రఘురామ.. ‘శివగామి’ ప్రస్తావన తీసుకొచ్చి కొత్త చర్చకు తెర తీశారని చెప్పాలి.