Begin typing your search above and press return to search.
రూ.కోటి తరలిస్తుండగా రఘునందన్ బావమరిది అరెస్ట్
By: Tupaki Desk | 1 Nov 2020 5:30 PM GMTదుబ్బాక ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హవాలా నగదు తరలింపు వ్యవహారంలో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ , బేగంపేట పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
వీరిలో దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బావమరిది సురభి శ్రీనివాసరావు, అతడి డ్రైవర్ రవికుమార్ ఉన్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఈ మేరకు బషీర్ బాగ్ కార్యాలయంలో మీడియాకు హవాలా నగదు తరలింపు వ్యవహారంపై మాట్లాడారు.
సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ ‘దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు రూ.కోటి నగదును తీసుకెళ్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాం. సురభి శ్రీనివాసరావు నగదు తీసుకెళ్తుండగా అతడితోపాటు డ్రైవర్ రవికుమార్ ను పట్టుకున్నాం. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు శ్రీనివాసరావు బావమరిది. బేగంపేటలోని విశాఖ ఇండస్ట్రీస్ నుంచి నగదు దుబ్బాక ఓటర్లకు పంచేందుకు తీసుకెళ్తున్నట్లు శ్రీనివాసరావు విచారణలో అంగీకరించారు. ఆ డబ్బును మాజీ ఎంపీ వివేక్ మేనేజర్ ఇచ్చినట్లు నిందితులు తెలిపారు. నగదు, కారు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం. దీనిపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయి విచారణ జరుపుతాం’ అని సీపీ అంజనీకుమార్ తెలిపారు.