Begin typing your search above and press return to search.

వైఎస్ ప్రస్తావన తెచ్చి నోరు జారి.. సారీ చెప్పిన రఘునందన్

By:  Tupaki Desk   |   23 Nov 2020 5:00 PM GMT
వైఎస్ ప్రస్తావన తెచ్చి నోరు జారి.. సారీ చెప్పిన రఘునందన్
X
గెలుపుతో వచ్చిన చిక్కే ఇదేంతా. మామూలు గెలుపుతోనే.. ఎక్కడికో వెళ్లిపోతుంటారు. విపరీతమైన ఆత్మవిశ్వాసం వచ్చేస్తుంది. తన మీద తనకు నమ్మకం పెరగటమే కాదు.. తన సామర్థ్యాన్ని మరింత ఎక్కువ చేసుకొని చూడటం కనిపిస్తుంది. అలాంటిది సంచలన విజయాన్ని సొంతం చేసుకుంటే పరిస్థితి మరెలా ఉంటుంది? దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయాన్ని నమోదు చేసిన రఘు నందన్.. తరచూ ఏదో విధంగా వార్తల్లోకి వస్తున్నారు. సోషల్ మీడియాలో నానుతున్నారు.
గతంలో ఆయన నోటి నుంచి వచ్చే మాట కొలత వేసినట్లుగా ఉండేది. గెలుపు తెచ్చిన ధీమానో కానీ.. ఆయన మాటలు తడబడుతున్నాయి. గెలుపు ధీమాతో ఆయన నోటి నుంచి వచ్చే మాటలు అనవసరమైన వివాదాలకు కారణమవుతున్నాయి. అలాంటిదే ఒకటి తాజాగా చోటు చేసుకుంది. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఎమ్మెల్యే రఘునందన్ దివంగత మహానేత.. వైఎస్ ను ఉద్దేశించి తప్పుడు మాటలు మాట్లాడారు. దారుణమైన రీతిలో నోరు జారారు.

‘‘నేను సైన్స్ టీచర్ని.. ప్రకృతిని నమ్ముతాం.. వెనకటి ఒకాయన గిట్లే మాట్లాడి, గట్లే పోయిండు.. పావురాల గుట్టల. నువ్వు కూడా గంతే.. యాక్షన్‌కు రియాక్షన్ కచ్చితంగా ఉంటుంది.’’ అంటూ రఘునందన్ వ్యాఖ్యానించారు.. ఈ పరిస్థితే తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా వస్తుందన్నారు. రఘు నందన్ వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.. అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురి కావటమే కాదు.. బీజేపీకి ఓటు వేయొద్దంటూ సోషల్ ప్రచారానికి తెర తీశారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయొద్దని కోరుతున్నారు.

తన మాట ప్రభావం పార్టీకి ఎంత నష్టంగా మారుతుందన్న విషయాన్ని గుర్తించిన రఘునందన్.. నష్టనివారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. తాను అనని మాటల్ని అన్నట్లుగా ప్చారం చేస్తున్నారని.. వైఎస్ కుటుంబంపై తనకు ఎలాంటి విరోధం లేదన్నారు. గతంలో వైఎస్ కటుుంబంపై కేసీఆర్ మాట్లాడిన మాటల్ని తాను గుర్తు చేసినట్లుగా చెప్పారు. గతంలో తాను వైఎస్ అమలు చేసిన పథకాల గురించి మాట్లాడిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని.. తాను తప్పుగా మాట్లాడలేదన్నారు. తన మాటలు ఎవరినైనా బాధిస్తే.. తప్పుగా అర్థమైతే తనను క్షమించాలన్నారు. వైఎస్ అభిమానులకు వివరణ రూపంలో ఆయన చెప్పిన క్షమాపణల్ని వారెంతవరకు తీసుకుంటారో చూడాలి. అందుకే అనేది.. గెలపు వేళ.. మరింత బాధ్యతగా.. జాగరూకతో ఉండాలని చెప్పేది.