Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌కు ఫిబ్ర‌వ‌రి 5 వ‌ర‌కు ర‌ఘురామ డెడ్‌లైన్‌..!

By:  Tupaki Desk   |   10 Jan 2022 12:02 PM GMT
జ‌గ‌న్‌కు ఫిబ్ర‌వ‌రి 5 వ‌ర‌కు ర‌ఘురామ డెడ్‌లైన్‌..!
X
వైసిపి రెబెల్ ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు వైసిపి అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి మరోసారి విసిరారు. ప్రతిరోజు రచ్చబండ కార్యక్రమంలో వైసిపి ప్రభుత్వ వైఫల్యాలతో పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న ఆయ‌న రెండు రోజుల క్రితం తాను తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నానని... ఉప ఎన్నికలకు సిద్ధం అని జ‌గ‌న్‌కు, వైసీపీ వాళ్ల‌కు సవాల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రోజు ఆయన మరోసారి జగన్‌కు సవాల్ విసిరారు. రాజీనామాపై డెడ్ లైన్ పెట్టిన రఘురామ‌ జగన్మోహన్ రెడ్డికి ఫిబ్రవరి 5వ తేదీ వరకు టైమ్ ఇస్తున్నట్టు ప్రకటించారు.

ఈలోగా తన ఎంపీ పదవిని డిస్ క్వాలీఫై చేయించాలని సవాల్ విసిరారు. అలా చేయలేని పక్షంలో జగన్ తాను ద‌మ్ములేని ముఖ్యమంత్రిగా ఒప్పుకోవాలని కూడా వ్యాఖ్యానించారు. సోమవారం రచ్చబండ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన రఘురామ తన ఎంపీ పదవి డిస్ క్వాలీఫై కి సంబంధించి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో వైసిపి నాయకులు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, లోక్‌స‌భ స్పీకర్ ఓం బిర్లాల‌లో ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చు అని సవాల్ విసిరారు.

తాను తన ఎంపీ పదవికి రాజీనామా చేసి... మళ్లీ నర్సాపురం నుంచి పోటీ చేస్తే భారీ మెజార్టీతో గెలుస్తాన‌ని ధీమా కూడా వ్యక్తం చేశారు. ఒకవేళ ఉప ఎన్నికల్లో తాను ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తాను గెలిస్తే సీఎం జగన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక తాను నరసాపురంలో పర్యటించడం లేదని వస్తున్న విమర్శలపై కూడా ఆయన స్పందించారు. ఈనెల 13వ తేదీన నరసాపురం వెళ్తున్నట్టు చెప్పిన ఆయన రెండు రోజుల పాటు అక్కడే ఉంటానని తెలిపారు.

రాష్ట్రంలో తాను ఉండే రెండు రోజుల్లో తనకు ఏపీ పోలీసు భద్రత కల్పించాలని కూడా కోరారు. అయితే రఘురామ చివరలో ట్విస్ట్ ఇస్తూ ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించడం కోసమే తన ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. రెండు రోజుల క్రితం రఘురామ ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన వెంటనే వైసిపి ఉప ఎన్నికలను ఎలా ? ఎదుర్కోవాలి అన్న అంశంపై అప్పుడే కసరత్తు ప్రారంభించింది. అయితే ఇప్పుడు రఘురామ డెడ్‌లైన్‌ పెట్టడంతో వైసిపి ఏం స్టెప్ వేస్తుందో ? చూడాలి.