Begin typing your search above and press return to search.

మోడీ ఆధిపత్యం ఎంత ప్రమాదమో చెప్పాడు

By:  Tupaki Desk   |   14 Oct 2019 8:33 AM GMT
మోడీ ఆధిపత్యం ఎంత ప్రమాదమో చెప్పాడు
X
భారత రిజర్వ్ బ్యాంక్ కు గవర్నర్ గా చేసిన రఘురాం రాజన్ గొప్ప ఆర్థికవేత్తగా పేరుపొందారు. యూపీఏ హయాంలో ఈయన స్టిక్ట్ గా అమలు చేసిన విధానాల వల్ల భారత ఆర్థికవ్యవస్థ 8శాతం వృద్ధిరేటును దాటి పరుగులు పెట్టింది. నాటి ప్రధాని మన్మోహన్ - కాంగ్రెస్ వారు ఎంత ఒత్తిడి తెచ్చిన ఆర్థిక నిర్ణయాల్లో ఎక్కడా తలొగ్గని మొండి ఘటంగా పేరొందారు..

కాంగ్రెస్ కు అధికారం పోయింది. ఈయనా రిటైర్ అయిపోయారు. అయితే ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ శక్తి సామర్థ్యాలు తెలిసి అమెరికా వర్సిటీ సహా బ్రిటన్ లు తమ యూనివర్సిటీల్లో ఆర్థిక పాఠాలు చెప్పాల్సిందిగా నియమించుకున్నాయి. ప్రస్తుతం రఘురాం రాజన్ ఇదే పనిలో ఉన్నారు.

తాజాగా బ్రౌన్ యూనివర్సిటీలో పరిధిలోని వాట్సన్ ఇన్ స్టిట్యూట్ లో స్మారకోపన్యాసాన్ని రాజన్ చేశారు. ఈ సందర్భంగా భారత్ లోని మోడీ ప్రభుత్వం తీరును ఆయన తీవ్రంగా ఎండగట్టారు. భారత్ లో ఆధిపత్య ధోరణి నెలకొన్నదని.. ఇదే ఆర్థికవృద్ధికి విఘాతంగా మారిందని సంచలన కామెంట్స్ చేశారు.

మోడీ ప్రభుత్వం ఆధిపత్యం.. మతాలు - కులాల మద్దతు కోసం ప్రయత్నించడం దేశభవిష్యత్తును అంధకారంలోకి నెడుతోందని రఘురాం రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ భద్రత మరింత బలోపేతం కావాలంటే అది ఆర్థిక వృద్ధితోనే సాధ్యమని.. ఇలా ఆధిపత్య ధోరణితో కాదని మోడీ ప్రభుత్వానికి చురకలంటించారు. ఆధిపత్య ధోరణి జాతిని బలహీన పరుస్తుందని.. వారి సమగ్రత కోసం పోరాటం మొదలవుతుందని రఘురాం రాజన్ హెచ్చరికలు జారీ చేశారు.మొత్తంగా మోడీ పాలన - ఆర్థిక విధానాలు దేశానికి డేంజర్ అని ఆయన కుండబద్దలు కొట్టారు.