Begin typing your search above and press return to search.
రాజన్ వెళ్లిపోతున్నారా?
By: Tupaki Desk | 8 April 2015 9:22 AM GMTయూపీఏ సర్కారు ఏరి కోరి మరీ తెచ్చుకున్న ఆర్‌బీఐ గవర్నర్ రఘురాం రాజన్ తన పదవికి రాజీనామా చేస్తారా? అంటే అవుననే చెబుతున్నారు. ప్రధానమంత్రిగామోడీ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రాజన్.. నమోల మధ్య దూరం పెరిగిందన్న వార్తలు వచ్చాయి.
సైద్ధాంతికంగా వేర్వేరు భావజాలం ఉన్న ఇరువురి మధ్య సత్‌సంబంధాలు లేవనే వాదనలు బాగానే వ్యాపించాయి. అయితే.. అలాంటిదేమీ లేదంటూ పలుమార్లు ఒకరికొకరు చెప్పుకున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య దూరం తగ్గిందని పలువురు భావించారు. అయితే.. తాజాగా ఆర్‌బీఐ నియంత్రణా అధికారాల్ని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవటంతో రాజన్‌కు ఏ మాత్రం ఇష్టం లేదంటున్నారు.
ఏ అంశం మీదా ఏకాభిప్రాయం లేని చోట పని చేయటం అనవసరమన్న భావనతో రాజన్ ఉన్నారని.. అందుకే ఆయన తన పదవికి రాజీనామా చేసి.. అంతర్జాతీయ ద్రవ్యనిధికి అధిపతిగా వెళ్లనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్ని బలపరిచేలా ఒక ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ విడుదల చేసిన ఒక నివేదికలో ప్రధాని.. ఆర్‌బీఐ గవర్నర్ మధ్య ఉన్న దూరాన్ని ప్రస్తావించటం చూసినప్పుడు రాజన్ పోక పక్కా అంటున్నారు.