Begin typing your search above and press return to search.
పేపరు పులి కాదంటున్న రాజన్
By: Tupaki Desk | 13 Jan 2016 4:57 AM GMTచాలా పరిమిత సందర్భాల్లో మాత్రమే వార్తల్లోకి వచ్చినా.. అత్యంత ప్రభావవంతమైన పదవుల్లో ఒకటిగా ఆర్ బీఐ గవర్నర్ గిరి అని చెప్పొచ్చు. మరి.. అలాంటి పదవిలో ఉండి.. తాను అనుకున్నది మాత్రమే చేసే తత్వం రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ ది. ప్రభుత్వాధినేతలు కోరారనో.. వారి ఒత్తిడికి ఓకే చెప్పేయటం రఘురామ్ కు సుతారమూ ఇష్టముండదు. తాజాగా ఆయన న్యూఇయర్ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి ఓ 5పేజీల ఉత్తరం ఒకటి రాశారు. ఈ సందర్భంగా ఆయన కాస్తంత ఘాటుగా దిశానిర్దేశం చేయటం గమనార్హం.
అత్యంత ప్రముఖులు పెద్దగా ప్రస్తావించని సంపన్నుల గురించి.. వారు చేసే తప్పుల్ని తన తాజా లేఖ ద్వారా ఎండగట్టిన రాజన్.. ‘‘తప్పు చేసిన వారు ఎంతటి సంపన్నులైనా.. శక్తివంతులైనా విడిచి పెట్టొద్దు. కఠినంగా శిక్షించాల్సిందే. శిక్షలు కేవలం సామాన్యులు.. బలహీనులకు మాత్రమే పరిమితం అవుతాయన్న అపప్రదను పోగొట్టాలి’’ అంటూ చెప్పాల్సిన విషయాన్ని సూటిగా చెప్పేశారు.
కఠినమైన నిబంధనలు సంపన్నుల్ని ఎందుకు ఏమీ చేయలేకపోతున్నాయన్న విషయాన్ని రఘురామ్ రాజన్ చాలానే స్పష్టంగా చెప్పేయటమే కాదు.. వ్యవస్థలు ఎలా నిర్వీర్యం అవుతాయో.. ఎందుకు చేష్టలుడిగినట్లు ఉండిపోతాయో చాలా చిన్న మాటతో చెప్పేయటం విశేషం. సంపన్నులు.. శక్తివంతులతో వైరం తెచ్చుకోవటానికి ఎవరూ ఇష్టపడరని.. అదే వారు మరిన్ని తప్పులు చేసి తప్పించుకునే అస్కారం ఏర్పడుతుందని చెప్పిన ఆయన.. ఇలాంటివే అధికారులపై ప్రజల్లో తప్పుడు భావన కలిగేలా చేస్తాయని చెప్పారు. రోగం తెలిసిన వైద్యుడుకి.. దాన్ని నయం చేయాలంటే ఏ మందు వేయాలో కూడా తెలిసిన వారు ఉండటం అరుదు. అలాంటి వ్యక్తుల్లో రఘురామ్ రాజన్ ఒకరని చెప్పక తప్పదు.