Begin typing your search above and press return to search.

తిరుగుబాటు ఎంపీ కొత్త పంచాయితి

By:  Tupaki Desk   |   15 Jun 2022 6:46 AM GMT
తిరుగుబాటు ఎంపీ కొత్త పంచాయితి
X
అధికార వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు కొత్త పంచాయితీ మొదలుపెట్టారు. తనకు అదనపు భద్రత ఇవ్వాలంటు డీజీపీ రాజేంద్రనాధరెడ్డికి లేఖ రాశారు. జూలై 4వ తేదీన జరగబోయే అల్లూరి సీతారామరాజు 125వ జయంతిలో పాల్గొనేందుకు ఎంపీ రాష్ట్రానికి రాబోతున్నారు. ఇదే కార్యక్రమానికి నరేంద్ర మోడీ వస్తున్నారు. మోడీ పాల్గొనే కార్యక్రమంలో తాను కూడా పాల్గొనాలని రఘురాజు కోరుకుంటున్నారు.

కాబట్టి తన పర్యటన జరిగే 48 గంటల పాటు తనకు అదనపు భద్రత కల్పించాలని డీజీపీకి లేఖ రాశారు. ఇప్పటికే ఎంపీకి కేంద్రం అదనపు సెక్యూరిటీని కేటాయించిన విషయం తెలిసిందే. ఇపుడు కేంద్రం ఇచ్చిన అదనపు భద్రత కాకుండా రాష్ట్రం కూడా అదనపు భద్రత కేటాయించాలని అడగటమే విచిత్రంగా ఉంది.

ఇంతకీ తిరుగుబాటు ఎంపీకి అదనపు భద్రత ఎందుకంటే తన పర్యటనలో లా అండ్ ఆర్డర్ సమస్యను క్రియేట్ చేసి ఆ నెపాన్ని తనపై నెట్టేసి తనను అరెస్టు చేయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసిందని తనకు తెలిసిందట.

నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం ఎంపీ అరెస్టుకు అలాగ ప్లాన్ చేస్తే మరి ప్రభుత్వ ప్లాన్ కు విరుద్ధంగా డీజీపీ ఎలా వ్యవహరిస్తారు. ఎంపీ కోరినట్లు అదనపు భద్రత ఎందుకు కల్పిస్తారు ? రాష్ట్రంలోకి అడుగుపెడితే తన ప్రాణాపాయం ఉందని, అక్రమ అరెస్టుకు అవకాశముందని చెబుతున్న ఎంపీ అసలు రాష్ట్రంలోకి అడుగుపెట్టడం ఎందుకు ? ఢిల్లీలో కూర్చుని వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డిని, ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకోవచ్చు కదా.

ఢిల్లీలో కూర్చోకుండా రాష్ట్రంలోకి అడుగుపెట్టాలని అనుకోవటం ఎందుకు ? హత్యకు కుట్ర జరుగుతోందని, తనకు అదనపు భద్రత కావాలని లేఖ రాయటమెందుకు ? పైగా తనకు సమాధానమిస్తే తాను ప్రధానమంత్రి కార్యాలయాన్ని సంప్రదిస్తానని బ్లాక్ మెయిలింగ్ ఒకటి.

ఇదంతా చూస్తుంటే కొత్తపంచాయితికి ఎంపీ ప్లాన్ చేస్తున్నట్లే అనుమానంగా ఉంది. రాదలచుకుంటే ధైర్యంగా రావటం లేదంటే ఢిల్లీలోనే కూర్చోవటమే ఎంపీ చేయాల్సిన పని. అంతేకానీ మధ్యలో డీజీపీని పంచాయితిలో ఇరికించాలని చూస్తే మొదటికే మోసం వస్తుందని ఎంపీ గ్రహించటం లేదు. మరీ పంచాయితి ఎలా ముగుస్తుందో చూడాల్సిందే.