Begin typing your search above and press return to search.

రఘురామరాజు అనర్హత పిటిషన్ ముందుకు కదలిందా?

By:  Tupaki Desk   |   29 Jan 2022 4:16 AM GMT
రఘురామరాజు అనర్హత పిటిషన్ ముందుకు కదలిందా?
X
వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామరాజుపై అనర్హత పిటీషన్ ప్రక్రియ స్పీడందుకుంటోంది. ఎంపీపై ముందు అనర్హత వేటుపడుతుందా ? లేకపోతే తానే ముందు ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా ? అనేది పెద్ద ఇష్యు అయిపోయింది. ఎలాగైనా ఎంపీపై అనర్హత వేటు వేయించాలనేది పార్టీ పట్టుదల. ఇదే సమయంలో తనపై పార్టీ అనర్హత వేటు వేయించలేరంటు ఎంపీ పదే పదే చాలెంజులు చేస్తున్నారు. తనపై అనర్హత వేటు వేయించేందుకు పార్టీకి ఫిబ్రవరి 5వ తేదీని డెడ్ లైన్ గా ఎంపీ విధించారు.

తన పై అనర్హత వేటు వేయించటం తమవల్ల కాదని పార్టీ చెప్పేస్తే తానే రాజీనామా చేస్తానంటు ఎంపీ బంపరాఫర్ కూడా ఇచ్చారు. సరే ఏదేమైనా ఎంపీ పెట్టిన డెడ్ లైన్ దగ్గరకు వచ్చేస్తోంది. ఇంతలో హఠాత్తుగా ఎంపీపై అనర్హత వేటు విషయాన్ని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రివిలేజ్ కమిటికి రెఫర్ చేశారు. అనర్హత వేటు విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలని ప్రివిలేజ్ కమిటిని స్పీకర్ ఆదేశించటం గమనార్హం. ఎప్పటిలోగా నిర్ణయం తీసుకోవాలో స్పీకర్ చెప్పినట్లు లేరు.

నరసాపురం ఎంపీతో పాటు అనర్హత పిటీషన్ పశ్చిమబెంగాల్లో తృణమూల్ ఎంపీ శిశిర్ అధికారిపైన కూడా పెండింగ్ లో ఉంది. తృణమూల్ తరపున ఎంపీగా గెలిచిన శిశిర్ అధికారి పోయిన ఏడాది బీజేపీలో చేరారు. అప్పటినుండి తృణమూల్ ఎంపీపై అనర్హత వేటు వేయించేందుకు ప్రయత్నిస్తునే ఉంది. అయితే వీళ్ళద్దరికీ బీజేపీతో పాటు కేంద్రంలోని అగ్రనేతల మద్దతున్న కారణంగా ఇంతకాలం ఫిర్యాదుల విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

అయితే మారుతున్న రాజకీయ సమీకరణల్లో ఎక్కువ కాలం ఫిర్యాదులను పెండింగ్ లో పెడితే మొదటికే మోసం వస్తుందని కేంద్రంలోని కీలక నేతలు గ్రహించినట్లున్నారు. తొందరలోనే రాష్ట్రపతి ఎన్నికలు, రాజ్యసభలో పెరుగుతున్న బలాలు, తొందరలోనే ఎన్టీయే భాగస్వాములను చేర్చుకోవటం లాంటి అనేక కీలకాంశాలు నరేంద్రమోడి ముందున్నాయి. కాబట్టి తమకు ముందు ముందు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఇపుడు రఘురాజుపై అనర్హత వేటు ఫిర్యాదు ప్రక్రియ స్పీడందుకుంది. మరి అనర్హత వేటు వేయించే విషయంలో పార్టీదే పై చేయవుతుందో లేదా ఎంపీయే రాజీనామా చేస్తారో చూడాలి.