Begin typing your search above and press return to search.
ఏపీ మద్యంపై రఘురామ ఆరోపణలు.. బేవరేజెస్ కార్పొరేషన్ క్లారిటీ?
By: Tupaki Desk | 2 Feb 2022 5:46 AM GMTఏపీలో దొరికే మద్యం బ్రాండ్లపై ఇప్పటికే సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. రాష్ట్రపతి బ్రాండ్ సహా చాలా కొత్త కొత్త రకాలు దర్శనమిస్తున్నాయి. ఏపీలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మందుబాబులు ఎప్పుడూ చూడని కొత్త కొత్త బ్రాండ్లు మార్కెట్లోకి వచ్చాయి. నిజానికి అవన్నీ చాలా చవకబారు మద్యంగా జనాల్లో ప్రచారం ఉంది.
అప్పటి వరకు ఉన్న ప్రీమియం బ్రాండ్లలో చాలా వరకు మార్కెట్లో కనబడలేదు. దాంతో మందు బాబుల గోల కూడా ఎక్కువైపోయింది. విచిత్రమేంటంటే జనాలకు కావాల్సిన మందును ప్రభుత్వం సప్లై చేయడం లేదంటూ చంద్రబాబునాయుడు ఏకంగా ప్రకాశం జిల్లాలో నిర్వహించిన రోడ్డుషోలో ప్రస్తావించారు. ఇక టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వరరావు అయితే మద్యం బ్రాండ్లపై ఎన్నిసార్లు మీడియా సమావేశాలు పెట్టి బాధపడ్డారో చెప్పలేం.
తెలంగాణ సహా దేశమంతా పాపులర్ అయిన మద్యం బ్రాండ్లు దొరుకుతాయి. కానీ ఏపీలో మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తున్న జగన్ సర్కార్ ప్రత్యేకమైన బ్రాండ్లను తయారు చేసి ప్రజలకు మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తుందన్న ఆరోపణలున్నాయి.
ఏపీ ప్రభుత్వం విక్రయించే వివిధ మద్యం బ్రాండ్లపై విపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. దీనికి తోడు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీలో విక్రయిస్తున్న మద్యంలో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ స్పందించింది. ఈ ఆరోపణలకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని లేఖ రాసింది. రఘురామకు గట్టి కౌంటర్ ఇచ్చింది.
రఘురామ కృష్ణరాజు ఇటీవల మాట్లాడుతూ ఏపీలో విక్రయిస్తున్న మద్యం బ్రాండ్లలో ప్రమాదకర పదార్థాలు వాడుతున్నారని ఆరోపించారు. ఏపీ మద్యం ఆరోగ్యానికి హానికరమంటున్నారు.
ఎస్.జీ.ఎస్ అనే కెమికల్ ల్యాబ్ లో ఏపీలో విక్రయిస్తున్న మద్యానికి పరీక్షలు నిర్వహించగా అందులో ప్రమాదకర పదార్థాలు ఉన్న విషయం వెలుగుచూసినట్లు పేర్కొన్నారు. స్పందించిన ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి నిన్న రఘురామకు లేఖ రాస్తూ ఆ పరీక్షల వివరాలను ఇవ్వాలని కోరారు. దీనికి రఘురామ ఎలా స్పందిస్తారో చూడాలి.