Begin typing your search above and press return to search.
రఘురామ హెల్త్ రిపోర్ట్ ఇదే.. వెల్లడించిన సుప్రీం
By: Tupaki Desk | 21 May 2021 9:42 AM GMTసీఐడీ విచారణలో తనను కొట్టారని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో.. వైద్య పరీక్షల నిమిత్తం సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రిలో మెడికల్ టెస్ట్ చేయించాలని ధర్మాసనం ఆదేశించింది. వైద్య పరీక్షలు పూర్తిచేసిన అనంతరం రిపోర్టు సీల్డ్ కవర్ లో సుప్రీంకు చేరింది.
దీనిపై ఇవాళ సుప్రీంలో విచారణ ప్రారంభమైంది. మెడికల్ రిపోర్టులో రఘురామకృష్ణం రాజు కాలికి గాలయ్యాయని, ఫ్రాక్చర్ కూడా ఉందని న్యాయమూర్తి జస్టిస్ వినీత్ శరణ్ వెల్లడించారు. దీనిపై రఘురామ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ స్పందిస్తూ.. తన క్లయింటు అయిన ఎంపీని హింసించారని, పోలీసులు కొట్టారనడానికి ఈ నివేదికే ఆధారమని అన్నారు.
అయితే.. ఆయన ఎంపీనా? కాదా? అన్నది కోర్టు చూడబోదని, చట్టం ముందు అందరూ సమానమేనని కోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై రోహత్గీ మాట్లాడుతూ.. ఒక ఎంపీకే ఇలాంటి పరిస్థితి వస్తే.. సాధారణ ప్రజల గతేంటని.. దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోర్టును కోరారు.
కాగా.. ప్రభుత్వ తరపున దుష్యంత్ దవే, వీవీ గిరి వాదనలు వినిపించారు. ఆర్మీసీ ఆసుపత్రి చెబుతున్న గాయాలు రఘురామకృష్ణం రాజు స్వయంగా చేసుకున్నవి కావొచ్చని దుష్యంత్ దవే అన్నారు. కాగా.. ఈ కేసులో మధ్యాహ్నం తర్వాత విచారణ కొనసాగనుంది.