Begin typing your search above and press return to search.
సీఎం జగన్ సోషల్ సైన్యానికి ఎంపీ రఘురామ ఘాటు హెచ్చరికలు
By: Tupaki Desk | 14 Dec 2020 1:12 PM GMTవైసీపీలో అసమ్మతి రాజేసిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు మరోసారి సీఎం జగన్ పై, వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. 20 రోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిపాలైన రఘురామ తాజాగా మరోసారి తెరపైకి వచ్చారు.
ముంబైలో గుండెకు సంబంధించి బైపాస్ సర్జరీ చేసుకున్న రఘురామ అది విజయవంతమైందని ప్రకటించారు. దీనిపై వైసీపీ సోషల్ మీడియాలో తీవ్ర ప్రచారం జరుగుతుండడంపై రఘురామ నిప్పులు చెరిగారు.
సీఎం జగన్ కు దగ్గరగా ఉండే వైసీపీ నేతలు మానసిక జబ్బుల కోసం ‘సైకోట్రోపిక్ డ్రగ్స్’ వాడుతున్నారని.. దీనికి సంబంధించి తన దగ్గర పక్కాగా సాక్ష్యాధారాలు ఉన్నాయని ఎంపీ రఘురామ సంచలన ఆరోపణలు చేశారు. జగన్ అనుమతిస్తే వారి పేర్లు బయటపెడుతానని చెప్పారు. జగన్ వైసీపీ సోషల్ మీడియా సైన్యంలోని కొందరి పరిస్థితి అదుపు తప్పిందన్నారు.
రఘురామ పోస్ట్ చేస్తూ ‘‘మా వైసీపీ.. అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగం వాళ్లు పనికిమాలిన వెధవల్లా తయారయ్యారు.‘రఘురామకృష్ణంరాజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు' అని తప్పుడు ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. ఒకే సామాజికవర్గానికి చెందిన ఓ మహిళా నేత, మరో ముగ్గురు మగ నాయకుల ఫొటోలతో ఆ ఫేక్ న్యూస్ వ్యాప్తిలోకి వచ్చింది. అవి చూసి ఇంకొందరు నా గురించి వికారమైన కామెంట్లు పెడుతూ రాక్షసానందం పొందుతున్నారు. నిజం చెప్పాలంటే నాకు హార్ట్ ఎటాక్ రానేలేదు.’ అని క్లారిటీ ఇచ్చారు.
నా గుండెలో బ్లాక్ ఉన్నట్టు గుర్తించి ముందు జాగ్రత్తగా సర్జరీ చేశారని రఘురామ తెలిపారు. నేను ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటానని.. మా పార్టీ వాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.