Begin typing your search above and press return to search.

ఆర్మీ వైద్యుల పరీక్షలో ఏమి తేలింది ?

By:  Tupaki Desk   |   22 May 2021 4:30 AM GMT
ఆర్మీ వైద్యుల పరీక్షలో ఏమి తేలింది ?
X
కొండను తవ్వి ఎలుకను పట్టిందనే పద్దతిలో ఉంది సికింద్రాబాద్ లో ఆర్మీ ఆసుపత్రి వైద్యులు నిర్వహించిన పరీక్షలు. గంటలతరబడి వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజును పరీక్షించిన తర్వాత వైద్యులు సుప్రింకోర్టుకు ఇచ్చిన నివేదికలో స్పష్టత లేకపోవటం విచిత్రంగా ఉంది. రాజద్రోహం ఆరోపణలపై సీఐడీ అధికారులు ఎంపిని అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. మరుసటిరోజు హైకోర్టులో బెయిల్ పిటీషన్ రెజెక్టయ్యింది.

బెయిల్ పిటీషన్ విషయం సెషన్స్ కోర్టులోనే తేల్చుకోవాలని హైకోర్టు స్పష్టం చేయటంతో ఎంపి తరపున లాయర్లు మధ్యాహ్నం జిల్లాకోర్టులో పిటీషన్ వేశారు. సాయంత్రం విచారణకు హాజరైన సమయంలో ఎంపి మీడియాతో మాట్లాడినపుడు కస్టడీలో తనను పోలీసులు కొట్టారని ఆరోపణలు చేశారు. దాంతో రాజద్రోహం అంశం పక్కకుపోయి కొట్టారన్న అంశమే పెద్దదయిపోయింది.

సీఐడీ పోలీసులు కొట్టారన్న విషయంపై క్లారిటి కోసం సెషన్స్ కోర్టు మెడికల్ బోర్డును ఏర్పాటుచేసింది. ఎంపీని పరీక్షించిన బోర్డు ఎడీమా సమస్య వల్లే కాళ్ళల్లో వాపు, పాదాల రంగుమారింది కాని కొట్టడం వల్ల కాదని తేల్చేసింది. అంటే మెడికల్ బోర్డు నివేదిక చాలా స్పష్టంగా ఉంది. తర్వాత ఇదే విషయమై సుప్రింకోర్టులో విచారణ జరిగినపుడు ఎంపికి ఆర్మీ ఆసుపత్రిలో పరీక్షలు చేయించమని జడ్జీ ఆదేశించారు. వ్యైద్యులు కూడా పరీక్షించి నివేదిక అందించారు.

ఇంతవరకు బాగానే ఉందికానీ వైద్యులిచ్చిన రిపోర్టే చాలా విచిత్రంగా ఉంది. సుప్రింకోర్టు జడ్జి చదివి వినిపించిన రిపోర్టు ప్రకారం ఎంపి కాలికి గాయాలున్నాయన్నారు. కాలి ఎముక ఫ్రాక్షర్ అయ్యిందని ఒకచోట, కాలి బొటనవేలికి పక్కవేలికి గాయముందని ఒకసారి చెప్పారు. అయితే ఎంపి కాలికి అయిన గాయం పోలీసులు కొట్టడం వల్లే అయ్యిందని ఎక్కడా స్పష్టంగా తేల్చలేదు. అలాగే ఎంపికి జనరల్ ఎడీమా ఉందని కూడా తేల్చారు. ఇక బొటనలేలికి పక్కవేలికి గాయమంటే అదికూడా కొట్టడం వల్లే అయ్యిందని చెప్పలేదు.

నిజంగానే పోలీసులు ఎంపిని కొడితే కచ్చితంగా బొటనవేలికి పక్కనవేలికి మాత్రమే గాయమయ్యేట్లు ఎలా కొట్టగలరు. కొడితే పాదం మొత్తానికి గాయమవుతుందని లేదా వేళ్ళన్నింటికీ గాయమవ్వాలి. అంతేకానీ పాదానికి ఉన్న ఐదు వేళ్ళల్లో కేవలం ఒక్క వేలికి మాత్రమే గాయమయ్యేట్లు కొట్టారని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. ఇదే సమయంలో మెడికల్ బోర్డు నివేదిక తప్పని చెప్పలేదు. అలాగే ఆర్మీ వైద్యులిచ్చిన నివేదికను నిర్ధారించలేదు. మెడికల్ బోర్డు నివేదిక ఇచ్చినంత స్పష్టంగా ఆర్మీ వైద్యుల నివేదిక లేకపోవటం గమనార్హం. ఎంపి కాలికి గాయమైందని అన్నారే కానీ అది ఎడీమా వల్లే అయ్యిందా ? లేకపోతే కొట్టడం వల్లే అయ్యిందా అని జడ్జీ కూడా తేల్చలేదు.