Begin typing your search above and press return to search.
రఘురామ ఆరోపణలకు ఆధారాలేవీ?
By: Tupaki Desk | 31 May 2021 8:30 AM GMTనరసాపురం వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజుపై పెద్ద కుట్ర జరిగిందా ? అవుననే అంటున్నారు ఆయన. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాధ్ కు చేసిన ఫిర్యాదును బట్టి ఆర్మీ ఆసుపత్రిలో ఉన్నపుడు ఎంపిపై పెద్ద కుట్రే జరిగిందట. సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న ఎంపిని మళ్ళీ అరెస్టు చేసేందుకు ఏపి పోలీసులు ప్రయత్నించారట. అందుకని ఆసుపత్రి చుట్టూ మోహరించారట. ఆ విషయం తెలుసుకున్న తాను కుట్రనుండి బయటపడ్డానని ఫిర్యాదులో చెప్పుకున్నారు.
సుప్రింకోర్టు ఆదేశాలతో ఆర్మీ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న తనను వెంటనే డిస్చార్జి చేసేట్లు కుట్ర జరిగిందట. ఆసుపత్రి రిజిస్ట్రార్ కేపీరెడ్డి, టీటీడీ జేఈవో ధర్మారెడ్డి, గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డితో కలిసి కుట్రచేశారట. పూర్తిస్ధాయిలో తనకు వైద్యం అందకుండా వెంటనే విడుదల చేసేట్లు కేపీరెడ్డితో ధర్మారెడ్డి, అమ్మిరెడ్డి కుట్రపన్నారట. ఈ కారణంగానే మూడు వాహనాల్లో ఏపి పోలీసులు ఆసుపత్రి దగ్గరే ఉన్నట్లు ఎంపి చెప్పారు.
15 మంది ఏపి పోలీసులకు కేపీ రెడ్డే ఆసుపత్రి మెస్ లోభోజనాలు ఏర్పాటు చేశారట. పోలీసులకు అయిన మెస్ బిల్లును కూడా ఎంపి తన ఫిర్యాదుతో జతచేసినట్లు చెప్పారు. మొత్తం కుట్రను టీటీడీ జేఈవో ధర్మారెడ్డి 18వ తేదీన హైదరాబాద్ లో కూర్చుని కుట్రను పర్యవేక్షించినట్లు ఫిర్యాదుచేశారు. పై ఇద్దరితో కుమ్మకైన కారణంగానే కేపీ రెడ్డి తనను 24వ తేదీనే డిస్చార్జి చేయాలని డాక్టర్లపై ఒత్తిడి తెచ్చారట. అయితే తన అభ్యర్ధన మేరకు 24న కాకుండా 26వ తేదీన డిస్చార్జి చేసినట్లు ఎంపి చెప్పటం గమనార్హం.
మొత్తాన్ని చూస్తే తనకు వ్యతిరేకంగా పై ముగ్గురు కుట్రచేసినట్లు ఎంపి ఎక్కడా ఆధారాలు చూపలేదు. మెస్ బిల్లు తప్ప మరో ఆధారాన్ని కూడా ప్రస్తావించలేదు. నిజంగానే ఎంపిని 24వ తేదీన డిస్చార్జి చేయించాలని ఆసుపత్రి రిజిస్ట్రార్ కేపీరెడ్డి అనుకుంటే డాక్టర్లు ఆయన మాట కాదని ఎంపి అభ్యర్ధనను మన్నిస్తారా ? ఆసుపత్రి డాక్టర్లకు తమ రిజిస్ట్రార్ మాటకన్నా ఎంపి మాట ఎక్కువేమీ కాదు. రిజిస్ట్రార్ మొబైల్ కాల్ డేటా రికార్డును తెప్పించి మొత్తం కుట్రపై దర్యాప్తు చేయించాలని ఎంపి కేంద్రమంత్రిని రిక్వెస్టు చేశారు. మరి ఈ వ్యవహారంపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.