Begin typing your search above and press return to search.

తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడా ?

By:  Tupaki Desk   |   8 Jun 2021 4:30 AM GMT
తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడా ?
X
వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణరాజు వ్యవహారం చూస్తుంటే అలాగే ఉంది. రాజద్రోహం కేసు విచారణను తప్పుదోవ పట్టించేందుకు, దర్యాప్తు అధికారులను బ్లాక్ మెయిల్ చేసే విధంగా ఎంపి వైఖరి ఉందంటు సీఐడీ అనుమానిస్తోంది. అందుకనే తమపై ఢిల్లీ పోలీసులకు ఎంపి తప్పుడు కేసు పెట్టారని సీఐడీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. తాము కస్టడీలోకి తీసుకున్నపుడు ఎంపి ఫోన్ను నిబంధనల ప్రకారమే తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఇదే విషయమై సీఐడీ తొందరలోనే సుప్రింకోర్టులో పిటీషన్ వేయబోతున్నట్లు సమాచారం.

 

ఎంపి నుండి ఫోన్ తీసుకున్నపుడు దాని నెంబర్ 90009111111 అని చెప్పినట్లు పోలీసులు చెప్పారు. కానీ ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తమ దగ్గర 9000922222 నెంబర్ ఫోన్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఎంపి నుండి తాము స్వాధీనం చేసుకున్న ఫోన్ విషయం కోర్టుకి తెలియజేయటమే కాకుండా తర్వాత ఆ ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబరేటరీకి పంపినట్లు సీఐడీ అధికారులు చెప్పారు. అంటే ఎంపి ఆరోపిస్తున్నట్లుగా ఆ ఫోన్ సీఐడీ దగ్గర లేదన్నమాట.

మరి పోలీసుల దగ్గర లేని 9000911111 నెంబర్ నుండి ఐఏఎస్ మాజీ అధికారి పీవీ రమేష్ కు వాట్సప్ మెసేజ్ ఎలా వెళ్ళిందన్నదే అర్ధం కావటంలేదు. ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఉన్న ఫోన్ నుండి రమేష్ కు వాట్సప్ మెసేజ్ వెళ్ళే అవకాశమే లేదు. అరెస్టయినపుడు సీఐడీ అధికారులకు ఒక నెంబర్ చెప్పిన ఎంపి ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం మరో నెంబర్ ఎలా ఇచ్చారన్నది మిస్టరీగానే ఉంది. హోలు మొత్తంమీద చూస్తుంటే రఘురామ విషయంలో బెయిల్ రద్దు చేయాలని సీఐడీ తొందరలోనే సుప్రింకోర్టులో పిటీషన్ వేసేట్లుగానే ఉంది.

మొబైల్ మిస్టరీ తేలాలంటే మళ్ళీ ఎంపిని సీఐడీ విచారణ చేయాల్సిందే. ఇటు విచారణకు నోటీసు ఇవ్వటం అటు బెయిల్ రద్దు పిటీషన్ వేయటం అనే రెండంచెల వ్యూహంలో సీఐడీ పోలీసులున్నట్లు సమాచారం. బెయిల్ ఇచ్చేటపుడు సుప్రింకోర్టు పెట్టిన షరతులను కూడా ఎంపి ఉల్లంఘించారని సీఐడీ తన బెయిల్ రద్దు పిటీషన్లో స్పష్టంగా ఆధారాలతో సహా చూపనున్నట్లు తెలిసింది.

ఇక్కడే ఇంకో విషయం కూడా గమనించాలి. మామూలుగా ఎవరి వాట్సప్ కైనా అసభ్యకరమైన మెసేజ్ వస్తే దాన్ని వెంటనే డిలీట్ చేసేస్తారు. తెలిసిన నెంబర్ నుండి వస్తే వెంటనే ఫోన్ చేసి అదే విషయాన్ని అడుగుతారు. కొత్తనెంబర్ నుండి కాకుండా పదే పదే అసభ్యకరమైన మెసేజ్ వస్తుంటే ముందు బ్లాక్ చేస్తారు లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. కానీ రమేష్ మాత్రం తనకు మెసేజ్ వచ్చిందని డైరెక్టుగా ట్విట్టర్లో పోస్టు చేయటమే ఆశ్చర్యంగా ఉంది. పైగా ఆ ట్వీట్ ఆధారంగా ఎంపి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసేశారు. మొత్తానికి ఎంపి వ్యవహారం రోజుకో సంచలనంగా మారుతోంది.