Begin typing your search above and press return to search.
కావాలనే ఎంపి రెచ్చగొడుతున్నారా ?
By: Tupaki Desk | 19 Jun 2021 1:30 PM GMTఅధికారపార్టీకి ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజుకు ఏమాత్రం పడటంలేదు. తాజా రాజకీయ పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వరుసగా లేఖలు రాస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో నరసాపురంలో వైసీపీ తరపున పోటీచేసిన రఘురామ అతికష్టం మీద గెలిచారు. రఘురామకు వచ్చిన 30 వేల మెజారిటి చూస్తే వైసీపీ తరపున పోటీ చేశారు కాబట్టే ఈ మాత్రం మెజారిటితో అయినా గెలిచారన్నది స్పష్టమైపోతుంది.
గెలిచిన కొంత కాలానికే జగన్ తో వచ్చిన విభేదాల కారణంగా పార్టీ, ప్రభుత్వంపై ఎంపి తిరుగుబాటు మొదలుపెట్టారు. జగన్ వ్యతిరేక మీడియాతో చేతులు కలిపిన ఎంపి ప్రభుత్వం+పార్టీకి వ్యతిరేకంగా ఎంతగా రెచ్చిపోతున్నారో అందరు చూస్తున్నదే. జగన్ మీద కూడా డైరెక్టుగా రెచ్చిపోయి నోటికొచ్చింది మాట్లాడటంతో సీఐడీ కేసు పెట్టింది. దాని తర్వాత పరిణామాలు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఆర్మీ ఆసుపత్రి నుండి డిస్చార్జవ్వగానే ఢిల్లీకి వెళ్ళి జగన్ కు వ్యతిరేకంగా చాలామందిని కలిసి ఫిర్యాదులు చేశారు. ఎంపిలకు, ముఖ్యమంత్రులకు, గవర్నర్లకు లేఖలు రాశారు. సరే ఇందంతా రాజుకు మామూలే అని సరిపెట్టుకుంటే ఇపుడు మళ్ళీ కావాలనే పార్టీని రెచ్చగొట్టే పనిపెట్టుకున్నారు. జగన్ పైన అందరికీ ఫిర్యాదులు చేసిన ఎంపి మళ్ళీపుడు జగన్ కు లేఖలు మొదలుపెట్టారు.
పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలను, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చేయాల్సిన పనులపై ప్రభుత్వాన్ని విమర్శిస్తు, ఆరోపణలు చేస్తు జగన్ను నిలదీస్తున్నారు. నిజానికి ఎంపి ప్రభుత్వాన్ని ఉద్దేశించి రాస్తున్న లేఖలను జగన్ అసలు పట్టించుకోవటంలేదు. అందుకనే జగన్ను రెచ్చగొట్టడమే టార్గెట్ గా డైరెక్టు ఎటాక్ చేశారు. దాని పర్యవసానం ఏమిటో తెలిసొచ్చింది.
అయినా సరే మళ్ళీ ఇపుడు అదే పద్దతి మొదలుపెట్టారు. జగన్ను టార్గెట్ చేస్తు లేఖలు రాయటం ఇందులో భాగమనే అనుకోవాలి. పార్టీని వద్దని ఎంపి అనుకున్నారు. అలాగే ఎంపిని కూడా పార్టీ లెక్కలో నుండి తీసేసింది. ఈ నేపధ్యంలో పార్టీ గురించి, ప్రభుత్వం గురించి ఎంపి పట్టించుకోవాల్సిన అవసరంలేదు. అయినా సరే మన ప్రభుత్వం, మన పార్టీ అంటు కావాలనే రెచ్చగొట్టే లేఖలు రాస్తున్నారు. అంటే కావాలనే రెచ్చగొడుతున్నట్లు తెలిసిపోతోంది. మరీసారి ఏమి జరుగుతుందో చూడాల్సిందే.