Begin typing your search above and press return to search.
రఘురామ ఓవర్ యాక్షన్
By: Tupaki Desk | 27 Jun 2021 6:30 AM GMT‘స్పెసిఫైడ్ అథారిటి ఏర్పాటు చేయటమంటే హిందువుల మనోభావాలను గాయపరచటమే’ ..ఇది తాజాగా వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు. టీటీడీ బోర్డు స్ధానంలో ప్రభుత్వం స్పెసిఫైడ్ అథారిటి నియమించింది. ఈ విషయమై జగన్ కు ఎంపి లేఖరాశారు. స్పెసిఫైడ్ అథారిటి నియమించటం పట్ల భక్తుల మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయట. నిజంగా ఎంపి రాసిన లేఖ చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లే ఉంది.
ఎందుకంటే స్పెసిఫైడ్ అథారిటిని నియమించటం జగన్ హయాంలోనే మొదలుకాలేదు. బోర్డు కాలపరిమితి అయిపోయినపుడు కొత్తబోర్డును ఏర్పాటు చేసేంతలోపు టీటీడీ పాలనకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రభుత్వం స్పెసిఫైడ్ అథారిటి ఏర్పాటు చేయటం చాలా సహజం. ఇలాంటి అథారిటికి ఇవో కన్వీనర్ గా ఉంటారు. ఇలాంటి అథారిటిని గత ప్రభుత్వాలు కూడా చాలాసార్లు నియమించాయి.
పైగా టీడీపీకి పూర్తిస్ధాయి బోర్డు ఉందా లేకపోతే స్పెసిఫైడ్ అథారిటి ఉందా అనేది పరిపాలనా సంబంధమైన అంశమే కానీ భక్తులకు ఎలాంటి సంబంధంలేదు. శ్రీవారి దర్శించుకోవాలని అనుకునే భక్తులకు బోర్డుంటే ఏమిటి ? స్పెసిఫైడ్ అథారిటి ఉంటే ఏమిటి ? జగన్ అనుకున్నట్లు బాండ్లు కొనుగోలు చేయటం కోసమే బోర్డు స్ధానంలో స్పెసిఫైడ్ అథారిటిని ఏర్పాటు చేశారని ఆరోపించటంలో కూడా అర్ధంలేదు.
టీటీడీ నుండి బాండ్లు కొనుగోలు చేయాలని జగన్ అనుకుంటే అది పూర్తిస్ధాయి బోర్డున్నప్పటికీ అడ్డేముంటుంది. బోర్డున్నా ఒకటే స్పెసిఫైడ్ అథారిటి ఉన్నా ఒకటే కదా. బోర్డులో మాత్రం ప్రభుత్వం ఆలోచనలకు భిన్నంగా నడుచుకునే వాళ్ళెవరైనా ఉంటారా ? అడ్డుచెబుతారా ? మొత్తానికి ఎంపి ఆలోచన ఏమిటంటే జగన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని తప్పుపట్టడమే టార్గెట్ గా ముందుకెళుతున్నారు. ఇందులో భాగమే స్పెసిఫైడ్ అథారిటి అని భక్తుల నమ్మకమని ఓవర్ యాక్షన్ చేస్తున్నారు.