Begin typing your search above and press return to search.

ర‌ఘురామ‌కృష్ణం రాజు సాధించింది.. గుండు సున్నానా?

By:  Tupaki Desk   |   29 Jun 2021 9:30 AM GMT
ర‌ఘురామ‌కృష్ణం రాజు సాధించింది.. గుండు సున్నానా?
X
వైసీపీ రెబ‌ల్ ఎంపీ.. ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. సొంత పార్టీపైనా.. పార్టీ అధినేత‌.. సీఎం జ‌గ‌న్‌పై చేసిన ఒంటెత్తు విన్యాసాలు.. సాధించింది ఏమైనా ఉందా? టీడీపీ అనుకూల మీడియా అండ చూసుకుని చెల‌రేగినా.. ల‌భించిన స‌క్సెస్ కొంతైనా క‌నిపిస్తోందా? అంటే.. లేద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. అంతేకాదు.. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ర‌ఘురామ‌రాజు.. సాధించింది.. గుండు సున్నా అనే చెబుతున్నారు. విష‌యంలోకి వెళ్తే.. న‌ర‌సాపురం ఎంపీగా గెలిచిన ర‌ఘురామ‌.. అనంత‌ర కాలంలో పార్టీలో కీల‌క రోల్ పోషించాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

మ‌రీముఖ్యంగా ఢిల్లీలో త‌న‌కు బీజేపీ నేత‌ల‌తో ఉన్న ప‌రిచ‌యాల‌ను అడ్డు పెట్టుకుని.. పార్టీ పార్ల‌మెంట‌రీ ప‌ద‌విని ఆశించిన‌ట్టు అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. అదేస‌మ‌యంలో న‌ర‌సాపురం పార్ల‌మెంటు ప‌రిధిలోనూ ఆధిప‌త్య రాజ‌కీయాల‌కు తెర‌దీశార‌ని వైసీపీ నేత‌లు ఆరోపించారు. ఈ క్ర‌మంలోనే ఎంపీ ర‌ఘురామ‌కు ఎమ్మెల్యే ముదునూరు ప్ర‌సాద‌రాజుకు.. మ‌ధ్య విభేదాలు ముదిరాయి. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ చాలా వ‌ర‌కు స‌ర్దు బాటు చేసే ప్ర‌య‌త్నం చేశారు. అయితే.. ఇది న‌చ్చ‌ని ర‌ఘురామ‌.. జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు ప్రారంభించారు. ఇక‌,ఈ విష‌యం రాను రాను ముదిరి.. ఏకంగా.. పార్టీ అదినేత జ‌గ‌న్ బెయిలును ర‌ద్దు చేయాలంటూ.. పిటిష‌న్ వేసే వ‌ర‌కు వ‌చ్చేసింది.

ర‌ఘురామ ఎపిసోడ్‌లో మొత్తంగా.. క‌నిపించేది.. తాను పార్టీ కార్య‌క్ర‌మాల‌కు క‌ట్టుబ‌డుతూనే.. ప్ర‌భుత్వ లోపాల‌ను ఎత్తి చూపుతు న్నానంటూ.. టీడీపీ అనుకూల మీడియాలో గంట‌ల‌కు గంట‌లు.. చ‌ర్చలు పెట్టి.. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డంతోపాటు.. ``మీరు న‌న్ను కెలికితే.. నేను జ‌గ‌న్‌ను కెలుకుతా`` అని హెచ్చ‌రిక‌లు చేసే వ‌ర‌కు వచ్చారు. అంతేకాదు.. జ‌గ‌న్‌ను ఇమిటేట్ చేస్తూ.. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక‌, జ‌గ‌న్‌పై ఏదైనా సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న టీడీపీ అనుకూల మీడియా.. ర‌ఘురామకు భారీ ఎత్తున క‌వ‌రేజ్ ఇచ్చేవారు. లైవులు, ప‌త్రిక‌ల్లో పెద్ద ఎత్తున ఫ‌స్ట్ పేజీల్లో ప్రాధాన్యం ఇచ్చేవారు.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు ర‌ఘురామ ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. పైగా.. ఆయ‌న లైవులు కానీ, ఫ‌స్ట్ పేజీ ఇండికేష‌న్లు కానీ.. లేదు. దీనికి కార‌ణం..ర‌ఘురామ ఇన్నాళ్ల పోరాటంలో అటు ఏపీ స‌ర్కారును కానీ, ఇటు సీఎం జ‌గ‌న్‌ను కానీ.. ఏమీ చేయ‌లేక పోవ‌డం. క‌నీసం.. తాను బ‌లంగా ఆరోపిస్తున్న న‌ర‌సాపురం నేత‌ల‌ను కూడా ఏమీ చేయ‌లేక‌పోవ‌డం. పైగా, సీఐడీ కేసులో ఒకటి రెండు ఛానెల్స్ ఇరుక్కోవ‌డంతో.. ఇప్పుడు ర‌ఘురామ క‌వ‌రేజీకి ఎవ‌రూ ఇష్ట ప‌డ‌డం లేదు. పైగా.. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన స‌బ్జెక్ట్ కూడా అయిపోయింది. దీంతో నిన్న మొన్న‌టి వ‌ర‌కు ర‌ఘురామ‌కు అనుకూలంగా ఉన్న మీడియా..ఇప్పుడు దూరం పెట్టింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. సో.. మ‌రి ఇప్ప‌టికైనా.. రాజా వారికి నిజానిజాలు తెలుస్తాయా? అంటున్నారు ప‌రిశీల‌కులు.