Begin typing your search above and press return to search.
సుజనా డైరెక్షన్ లో 'ఆర్ ఆర్ ఆర్'
By: Tupaki Desk | 17 Aug 2020 6:29 PM GMTగత చంద్రబాబు ప్రభుత్వంలో ఆయన లెఫ్ట్ అండ్ రైట్ గా సుజనా చౌదరి, సీఎం రమేశ్ లు అన్నీ తామై వ్యవహరించేవారనే పేరుంది. చంద్రబాబుకు ఆర్థిక అండదండలు అందిస్తూ వీరు టీడీపీలో కీలక రాజకీయాలు నడిపేవారని చెప్పేవారు. అయితే ఏపీలో టీడీపీ దారుణంగా ఓడిపోయిన తరువాత టీడీపీ హైకమాండ్ లో భాగమైన రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరితోపాటు మిగతా ముగ్గురు బిజినెస్ మెన్ లైన రాజ్యసభ ఎంపీలతో కలిసి సడెన్ బీజేపీలోకి జంప్ అయ్యాడు. అయితే దాని వెనుక చంద్రబాబు ఉన్నాడని.. ఎందుకంటే జంపింగ్ లిస్ట్ లో కేవలం బిజినెస్ మెన్స్ ఉండడం ఒక కారణం అని ప్రచారం జరిగింది. ఇక ఇంకొక కారణం.. బ్యాంక్ లతో లీగల్ ఇష్యూలు ఉండడం వల్లే వారంతా బీజేపీలో చేరితే సేఫ్ అని జంప్ అయినట్టు తెలుస్తోంది.
అయితే సుజనా చౌదరి బీజేపీలోకి జంప్ అయిన తరువాత.. బీజేపీలో ఉండి టీడీపీ అధికార ప్రతినిధి మాదిరిగా ఆయన వ్యవహరిస్తున్నాడని అధిష్టానానికి ఎన్నో ఫిర్యాదులు వెళ్లాయి. అమరావతిని ఇంచు కూడా కదపలేరని సుజనా బీజేపీ తరుఫున బెదిరించారు కూడా.. ఇక నిమ్మగడ్డ రమేశ్ ను హోటల్ లో కలవడం బయటపడిన తరువాత బీజేపీ పెద్దలు ఏపీ రాజకీయంపై సీరియస్ అయ్యారు. అందుకే బీజేపికి కొత్త అధ్యక్షుడుగా సోము వీర్రాజును మార్చారని టాక్ వినిపించింది. సోము వీర్రాజు వచ్చిన తరువాత ఆయన వ్యతిరేకులను వరుసగా సస్పెండ్ చేస్తుండడంతో సుజనా చౌదరి కాస్త సైలెంట్ అయ్యారు.
ఇప్పుడు సుజనా ప్లేసులో అమరావతిని రఘురామకృష్ణం రాజు ఎత్తుకుంటున్నాడు. అమరావతి మీద రోజూ ప్రెస్ మీట్స్ పెడుతున్నాడు. ఇది చూశాక అప్పులు తీసుకొని ఎగ్గొట్టి బ్యాంక్ లతో ప్రాబ్లం ఉన్నవారంతా ఇప్పుడు ఒక చోట చేరారని.. సుజనా డైరెక్షన్ లోనే రఘురామకృష్ణం రాజు వ్యవహరిస్తున్నారని వైసీపీ వర్గాల్లో.. సోషల్ మీడియాలో ఈ మేరకు విస్తృతంగా చర్చ నడుస్తోంది.