Begin typing your search above and press return to search.
రాధాకు ఏమైనా జరిగితే వైసీపీకే చెడ్డ పేరంటోన్న ఎంపీ..!
By: Tupaki Desk | 29 Dec 2021 1:37 PM GMTవైసీపీ రెబల్ ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజుకు తాజాగా షాక్ తగిలింది. గత యేడాదిన్నర కాలంలో ఏపీలో వైసీపీ ప్రభుత్వంతో పాటు ఆ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డిని టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేస్తూ వస్తున్నారు. రఘురామను సస్పెండ్ చేసే ధైర్యం కూడా వైసీపీ వాళ్లు చేయలేకపోతున్నారు. ఎప్పటికప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలతో పాటు ఇటు టీడీపీ వాళ్లతోనూ ఆయన టచ్‌లో ఉంటోన్న పరిస్థితి కనిపిస్తోంది. ఏపీలో ప్రతి రోజూ జరిగే రాజకీయ పరిణామాలపై రోజూ తన రచ్చబండ కార్యక్రమంలో ప్రభుత్వంలో లోపాలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతున్నారు.
తాజాగా విజయవాడకు చెందిన టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా తనను చంపేందుకు కొందరు రెక్కీ నిర్వహిస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేపాయి. పైగా రాధా వైసీపీ మంత్రి కొడాలి నాని, టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కలిసిన రోజు ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి అటు వైసీపీ, ఇటు టీడీపీ రెండు పార్టీల్లోనూ దుమారం రేపాయి. అసలు రాధా ఎవరిని టార్గెట్ చేసుకుని ఈ వ్యాఖ్యలు చేశారో కూడా ముందు ఎవ్వరికి అర్థం కాలేదు.
ఇదిలా ఉంటే ఇదే అంశంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన రాధా హత్యకు రెక్కీ జరిగిందని తెలిసిందని.. ఆయనకు ఏదైనా జరిగితే పార్టీకి, ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుందని చెప్పారు. రెక్కీపై పాదర్శకంగా విచారణ జరపాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
ఇక సీఎం జగన్మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దుపై సుప్రీంకోర్టుకు వెళ్తానని చెప్పిన రఘురామ సీపీఎస్‌ను పక్కదారి పట్టించేందుకే.. తెరపైకి సినిమా సమస్యను తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు. హీరో సిద్ధార్థ్‌కు ఏపీతో పనేంటని పేర్ని నాని ప్రశ్నించారని.. మరి జస్టిస్ చంద్రు, కనగరాజ్‌కు ఏపీతో పనేంటని ప్రజలు అంటున్నారని నానికి రఘురామ అదిరిపోయే పంచ్ వేశారు.