Begin typing your search above and press return to search.

ఎంపీగారి స‌ర్వే.. తుస్సేన‌ట‌.. వైసీపీ టాక్‌..!

By:  Tupaki Desk   |   20 Jan 2023 7:30 AM GMT
ఎంపీగారి స‌ర్వే.. తుస్సేన‌ట‌.. వైసీపీ టాక్‌..!
X
వైసీపీలో ఒక ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌సాగుతోంది. సొంత పార్టీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు ఇటీవ‌ల ఒక స‌ర్వే అంటూ.. కొన్ని విష‌యాలు వెల్ల‌డించారు. ఈయ‌న కొన్నాళ్లుగా వైసీపీపై విమ‌ర్శ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా సీఎం జ‌గ‌న్ కేంద్రంగా ఆయ‌న విరుచుకుప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న విమ‌ర్శ‌లు ఉంటున్నాయి. అయితే.. ఇటీవ‌ల ఆయ‌న తాను స‌ర్వే చేయించాన‌ని చెబుతూ..కొన్ని విష‌యాలు వెల్ల‌డించారు.

దీనిలో టీడీపీ వెలిగిపోతోంద‌ని.. వైసీపీ ఆరిపోయే దీప‌మ‌ని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లోనే టీడీపీకి 12 శాతం అధికంగా ఓటు బ్యాంకు సొంత‌మ‌వుతుంద‌ని చెప్పారు.

ఇక‌, ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో అయితే.. 14-16 శాతం ఓట్లు ప‌డ‌తాయ‌న్నారు. సీమ‌లో 12-14 శాతం, శ్రీకాకుళం స‌హా ఉత్త‌రాంధ్ర‌లో ప్ర‌జ‌లు 16 శాతం టీడీపీ వెంటే ఉన్నార‌ని లెక్క‌లు చెప్పారు.

ఇది వెల్ల‌డించిన త‌ర్వాత‌.. వైసీపీ నేత‌లు మౌనంగా ఉన్నారు. అయితే.. అంత‌ర్గ‌తంగా మాత్రం అస‌లు ఈ స‌ర్వే ఏంటి? ఎలా చేయించారు? అనే విష‌యాల‌పై వ‌లంటీర్ల ద్వారా ర‌హ‌స్యంగా స‌మాచారం సేక‌రించా రు.

దీనిలో తేలింది ఏంటంటే.. ఆయా జిల్లాల్లో జ‌రుగుతున్న‌రాజ‌కీయ ప‌రిణామాల‌ను అంచ‌నా వేసి.. ఎంపీగారు ఈ లెక్క‌లు వండి వార్చార‌ని, దీనిలో పెద్ద‌గా విశేషాలు ఏమీ లేవ‌ని.. తేలిపోయిందట‌.

అంతేకాదు.. అస‌లు ఏ ప్రాతిప‌దిక‌న‌.. ఎంపీ ఈ లెక్క‌లు చెప్పారంటే.. వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసును.. టీడీపీ నేత‌ల‌పై వైసీపీ ప్ర‌భుత్వం చేస్తున్న దాడుల‌ను అంచ‌నా వేసి.. ఈ గ‌ణాంకాలు చెప్పార‌ని వైసీపీ నేత‌లు తేల్చారు. అయితే..ఈ ప్ర‌భావం ఎన్నిక‌ల్లో ఉండ‌ద‌ని.. కేవ‌లం సంక్షేమం.. లేదా.. పాల‌న‌పైనే ఉంటుంద‌ని చివ‌ర‌కు తేల్చారు. అంతేకాదు.. ఎంపీపై మ‌రింత దాడి పెంచాల‌ని కూడా భావిస్తున్నారు. మ‌రి ఏం ?జ‌రుగుతుందో చూడాలి. మొత్తంగా ఎంపీ లెక్క‌ల్లో ప‌స‌లేద‌నేది వైసీపీ నేత‌ల మాట‌.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.