Begin typing your search above and press return to search.
జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్.. వెనక్కి ఇచ్చిన హైకోర్టు
By: Tupaki Desk | 6 Oct 2021 5:30 PM GMTఎంపీ రఘురామకృష్ఱరాజు స్వపక్షంలోనే విపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఏకంగా సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిలను టార్గెట్ చేసుకుని పలు విమర్శలు సంధిస్తున్నారు.
కొన్నాళ్లుగా వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్న ఆయన ఇప్పుడు జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టులను ఆశ్రయిస్తున్నారు.
జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్‌పై ఉన్న 11 ఛార్జీషీట్లపై సమగ్రమైన దర్యాప్తు చేయాలని, బెయిల్ రద్దు చేసి సీబీఐ విచారణ త్వరగా జరిగేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో కోరారు. అయితే రఘురామ పిటిషన్‌లో ఉన్న సాంకేతిక కారణాలతో ఎంపీ పిటిషన్‌కు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రీ వెనక్కి ఇచ్చింది. సాంకేతిక కారణాలను సరిచేసి తిరిగి పిటిషన్‌ను దాఖలు చేయాలని హైకోర్టు సూచించింది.
జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని రఘురామ సీబీఐ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అక్రమాస్తుల కేసులో బెయిల్‌పై విడుదలైన జగన్, విజయసాయి ప్రస్తుతం సీఎం, ఎంపీ పదవుల్లో ఉన్నందున ప్రత్యక్షంగా, పరోక్షంగా సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని, అందువల్ల ఇద్దరి బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణంరాజు నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది.
బెయిల్ రద్దు పిటిషన్ మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ రఘురామ తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్‌పై కీలక ఆదేశాలిచ్చింది. అప్పటి వరకు తీర్పు ఇవ్వకుండా సీబీఐ కోర్టును నిలువరించాలంటూ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌పైనా తెలంగాణ హైకోర్టులో విచారణ జరిపింది. పిటిషన్ల బదిలీకి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.