Begin typing your search above and press return to search.
జగన్, విజయసాయికి ఊరట.. రఘురామ పిటీషన్ కొట్టివేత!
By: Tupaki Desk | 15 Sep 2021 9:32 AM GMTఏపీ సీఎం వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సీబీఐ కోర్టు నుంచి మరో కోర్టుకు బదిలీ చేయాలన్న ఎంపీ రఘురామకృష్ణంరాజు వేసిన పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది. తీర్పు వెల్లడించకుండా స్టే ఇవ్వాలని.. పిటీషన్లను మరో కోర్టుకు బదిలీ చేయాలన్న రఘురామ పిటీషన్ ను హైకోర్టు నిరాకరించింది. రఘురామ దాఖలు చేసిన పిటీషన్ ను కొట్టివేసింది.
ఈ నేపథ్యంలోనే జగన్, విజయసాయి బెయిల్ రద్దు పిటీషన్లపై కాసేపట్లో సీబీఐ కోర్టు తీర్పు వెలువరించనుంది. రఘురామ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. దీంతో సీబీఐ కోర్టు తీర్పు చెప్పడానికి అడ్డంకులు తొలిగిపోయాయి.
ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై తుదితీర్పును సీబీఐ కోర్టు వాయిదా వేసింది.. ఈ మేరకు కోర్టు తీర్పునిచ్చింది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సీబీఐకోర్టులో పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ పై తుది తీర్పును సెప్టెంబర్ 15న ప్రకటిస్తామని కోర్టు స్పష్టం చేసింది.
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు గతంలోనే సీబీఐ కోర్టులో జగన్ బెయిల్ రద్దు చేయాలని.. ఆయన అధికారంతో సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారని ఈ పిటీషన్ దాఖలు చేశారు.ఇప్పటికే వైసీపీ ఎంపీగా గెలిచిన రఘురామను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వైసీపీ నిర్ణయించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేసినందుకు ఆయనపై చర్యలు తీసుకుంది.
రఘురామ దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటీషన్ పై గతంలోనే సీబీఐ ప్రత్యేక కోర్టు ఇరుపక్షాల వాదనలు విన్నది. సీబీఐ అధిప్రాయాన్ని కూడా తెలుసుకుంది. కోర్టు విచక్షణ మేరకే బెయిల్ రద్దు పిటీషన్ పై నిర్ణయం తీసుకోవాలని సీబీఐ అధికారులు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో ఇవాళ బెయిల్ రద్దుపై కోర్టు తుది తీర్పును వాయిదా వేసింది..
ఇక వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటీషన్ పై కూడా వాదనలు ముగిశాయి. విజయసాయిరెడ్డి, జగన్ బెయిల్ రద్దు పిటీషన్లపై ఒకేసారి తీర్పు వెలువరిస్తామని ధర్మాసనం నిర్ణయించింది. సెప్టెంబర్ 15న నేడు ఇరు పిటీషన్లపై తీర్పులు ఇస్తామని తెలిపింది.