Begin typing your search above and press return to search.
బాబు ను కేసుల్లో ఇరికించడం సాధ్యం కాదు: వైసీపీ ఎంపీ సంచలనం
By: Tupaki Desk | 28 Dec 2019 7:29 AM GMTకొద్ది రోజులుగా వైసీపీ కి దూరంగా.. బీజేపీ కి దగ్గర గా ఉంటూ వస్తున్న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు మరోసారి సంచలన వ్యాఖ్యల తో వార్తల్లో నిలిచారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసు లో చంద్రబాబు ను ఇరికించడం సాధ్యం కాదని రఘురామ కృష్ణం రాజు కుండబద్దలు కొట్టారు. ఓ మీడియా ఇంటర్వ్యూ లో రఘురామ స్పందించారు
చంద్రబాబు హయాం లో అమరావతి ప్రాంతంలో జరిగిన భూకొనుగోల్ మాల్ పై జగన్ సర్కారు విచారణకు సిద్ధమైన సంగతి తెలిసిందే. దీనిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చింది. దీనిపై సీబీఐ దర్యాప్తునకు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రఘురామకృష్ణం రాజు మాట్లాడుతూ ‘ఇప్పుడున్న చట్టాల వల్ల చంద్రబాబు ను ఇరికించడం సాధ్యం కాదని.. చట్టాలు మార్చడాన్ని పరిశీలించాలి’ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబును ఫిక్స్ చేయలేమని అభిప్రాయ పడ్డారు. ఆయన అన్ని లూప్ హోల్స్ ను గమనించే ఇలాంటి వాటిల్లో ఇరుక్కోకుండా వ్యవహరిస్తుంటారని తెలిపారు. వైసీపీ ఎంపీ గా ఉంటూ చంద్రబాబు ను వెనకేసుకొచ్చిన రఘురామ కృష్ణం రాజు వ్యవహారం ఇప్పుడు వైసీపీ పార్టీ లో దుమారం రేపుతోంది.