Begin typing your search above and press return to search.
పోలీసులు కొడుతున్న వేళ రఘురామ అలా చేశారట
By: Tupaki Desk | 27 Dec 2021 5:43 AM GMTరోటీన్ కు భిన్నమైన రాజకీయ నేతగా నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామగా చెప్పాలి. ఎవరైనా ఒక పేరున్న నేతను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లి చితక్కొట్టుడు కొడితే.. దాని గురించి పల్లెత్తు మాట చెప్పటానికి ఇష్టపడరు.
అందుకు భిన్నంగా తనను అరెస్టు చేసిన పోలీసులు.. ఏపీకి తీసుకెళ్లిన తర్వాత తనకు ఇచ్చిన ట్రీట్ మెంట్ ను పూస గుచ్చినట్లుగా చెప్పటమే కాదు.. నాడు జరిగిన విషయాల్ని ఒక్కొక్కటిగా బయటపెట్టి సంచలనంగా మారారు. పోలీసుల అదుపులో ఉన్న వేళ.. విచారణ పేరుతో తన కాళ్ల మీద కొట్టిన దెబ్బలకు తనకు ఎలాంటి అనుభవం ఎదురైందో ఆయన చెప్పుకొచ్చారు.
తనకు బాగా దెబ్బలు తగిలి.. ఆరోగ్యం దెబ్బ తిన్న వేళ.. తనకు వైద్య పరీక్షలు జరిపిన వైద్యుడు చెప్పిన అంశాల్ని వెల్లడించి షాకిచ్చారు. పోలీసులు కొడుతుంటే తాను ఏడవలేదు కానీ బాగా అరిచినట్లుగా చెప్పారు. జరిగిన ఉదంతాలతో ఇంట్లోని వారు భయపడ్డారా? అన్న ప్రశ్నకు చాలా భయపడ్డారని.. తనను ఇప్పుడు హైదరాబాద్ కూడా రావొద్దన్నారని చెప్పారు. ఒక చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించిన మరిన్ని ఆసక్తికర అంశాల్ని ఆయన మాటల్లోనే చూస్తే..
- ‘‘పోలీసులు పాదాల మీద కొడుతుంటే.. బుర్రలో వెయ్యి ఓల్టుల షాక్ కొట్టినట్లు అయింది. బాగా కేకలు వేశాను. తర్వాతి రోజు డాక్టర్ వచ్చారు. నా కాళ్లు వాచిపోయి ఉన్నాయి. బీపీ చూసి 165/110 అన్నారు. అయితే 120/80 అని రాశారు. అదేంటి.. ఇలా రాశారని అడిగితే... అలాగే రాయమన్నారని చెప్పాడు. సరే.. నా కాళ్లు వాచిపోయాయి దాన్ని రిపోర్ట్ చేయమని అడిగాను. అది నేను రాయకూడదని చెప్పిన వైద్యుడు.. మీకు ఒక సలహా.. కాళ్లలో ఉన్న బ్లడ్ క్లాట్స్ చాలా డేంజర్.. అవి పైకి వెళ్తాయి.. దానివల్ల హార్ట్ అటాక్ రావొచ్చని చెప్పారు’’
- ‘‘ అంతా బావుందని రిపోర్టు ఇవ్వమని వార్నింగ్ ఇచ్చి పంపారని వైద్యుడు చెప్పారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండని సలహా ఇచ్చారు.
- దెబ్బలు తిన్న తర్వాత అయినా ఎవడికీ పట్టనిది మనకెందుకు? అనిపించలేదా? అంటే.. ‘‘ఒక్క సెకను కూడా అనిపించలేదు. అంతకు ముందు పార్లమెంటులో కూడా ఎందుకురా బాబూ.. నువ్ ఏం చెప్పినా ఐదేళ్లు అతడే అధికారంలో ఉంటాడుకదా.. ఉపయోగం ఏముంది అని చెప్పినోళ్లు ఉన్నారు. కానీ.. ఒకటే జన్మ. మంచో చెడో ఒకసారి ప్రజలకు సేవ చేయాలని వచ్చాం. వెనక్కి వెళ్లే ప్రశ్న లేదు’’
- మిమ్మల్ని బూతులు తిడతారు.. విగ్గు రాజు అంటుంటారు కదా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘పొట్టిగా ఉన్న వాడు హీల్ వేసుకుంటాడు. జుట్టు తగ్గినోడు కొంచెం ప్యాచ్ వేసుకుంటారు. హీల్ వేసుకుంటున్నాడని అతడిని నేను పొట్టివాడు అంటున్నానా?’’ అంటూ పేరు మాత్రం ప్రస్తావించలేదు.
- తిట్ల ఫోన్లు ఈ మధ్యన తగ్గాయని.. రోజువారీగా మాట్లాడే వీడియోల కింద వ్యతిరేకత కామెంట్లు పెట్టే వారికి పోస్టుకు రూ.10 చొప్పున కానీ ఎంతో ఇస్తుంటారట. నన్ను ప్రేమించే వాళ్లు పెరిగి.. తిట్టేవాళ్లను తిరిగి తిట్టేస్తుంటే.. ఇప్పుడు వాళ్లు తగ్గారట. వ్యతిరేక కామెంట్లు బాగా తగ్గాయి. హార్డ్ కోర్ వైఎస్ గ్రూపుల్లోనూ వ్యతిరేకత కామెంట్లు తగ్గాయి. అంటే.. ప్రజల్లో మార్పు వస్తోంది.
- ఫిర్యాదు చేశాను. కాస్త ఆలస్యమైనా చర్యలు ఉంటాయి. ప్రధానికి లేఖ రాసిన తర్వాతే విజయసాయికి పిలుపు వచ్చింది. నేను రెండు లేఖలు రాశాను. ఆ తర్వాతే అమిత్ షాను కలవాలని సందేశం వచ్చింది. ఇంకా హోంమంత్రిని కలవలేదు. విజయసాయి రెడ్డి మాత్రం ఒక ఫోటో దిగి వచ్చారు.
- కేవలం మూడు నిమిషాల్లోనే ప్రధానిని కలిసి బయటకు వచ్చేశారని అక్కడి వారు చెప్పారు. రాష్ట్ర సమస్యల మీద చర్చించి వచ్చారని చెప్పారు. ఇక్కడో ఉదంతాన్ని నేను మీకు చెబుతాను. ‘‘అప్పట్లో ముఖ్యమంత్రి చెన్నారెడ్డి అమెరికాకు వెళ్లినప్పుడు నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆసుపత్రిలో ఉన్నారు.
‘ఆస్పత్రిలో ఉన్న నల్లపురెడ్డిని అమెరికా నుంచి పరామర్శించిన చెన్నారెడ్డి’ అని వార్త వచ్చింది. అప్పుడు ‘ఏం ఒళ్లెలా ఉంది..’ అని చెన్నారెడ్డి అన్నట్లు ఒక కార్టూన్. అలాగే పిలిచి వార్నింగ్ ఇచ్చి పంపిస్తే విజయసాయిరెడ్డి కూడా బయటకు వచ్చి అది చర్చించాం.. ఇది చర్చించామని చెబుతుంటారు.