Begin typing your search above and press return to search.

పార్లమెంట్ లో ల.. కొడకా అంటారా?: ఎంపీ రఘురామ

By:  Tupaki Desk   |   7 Dec 2021 1:06 AM GMT
పార్లమెంట్ లో ల.. కొడకా అంటారా?: ఎంపీ రఘురామ
X
చట్ట సభల్లో సభ్యులు కనీస మర్యాదలు పాటించడంలేదు. ప్రజల సమస్యల కోసం చట్ట సభలకు పంపితే... ప్రజా సమస్యలను పక్కకు పెట్టి వ్యక్తిగత దూషణలకు దిగితూ ప్రజాప్రతినిధులు అభాసుపాలవుతున్నారు. ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబంపై వైసీపీ ఎమ్మెల్యే నోరుపారేసుకున్నారు. ఈ ఘటనపై ఏపీలో ఆగ్రహావేశాలు చల్లారముందే అదే పార్టీకి చెందిన ఎంపీలు తనను అసభ్య పదజాలంతో దూషించారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వాపోయారు.

వైసీపీ నేతలు పార్లమెంటులోనే బుతులు మాట్లాడారంటూ రఘురామ తీవ్ర ఆగ్రహ్యం వ్యక్తం చేశారు. లన్..కొడకా అంటూ తనపై నోరుపారేసుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ నేతల సంస్కారం ఇదేనా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు వేదికగా జరిగిన ఘటనాక్రమాన్ని ఆయన మీడియాకు వివరించారు.

న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్రను పోలీసులు అడ్డుకుంటున్నారని పార్లమెంటల్ లో రాఘురామ తప్పుబట్టారు. హైకోర్టు నుంచి అనుమతులు ఉన్నా పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడం ఏమిటని రఘురామ ప్రశ్నించారు. రైతులు రాజధాని కోసం 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని, అలాంటి రైతులను పోలీసులు తీవ్రంగా హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల ప్రాథమిక హక్కులను కూడా పోలీసులు హరిస్తున్నారన్నారని తప్పుబట్టారు. అమరావతి రైతులపై పోలీసుల ఆంక్షలను ఆయన లోక్ సభలో వివరించే ప్రయత్నం చేశారు. సభలో వైసీపీ ఎంపీలు ఆయన ప్రసంగానికి అడుగడునా అరుస్తూ అడ్డుపడ్డారు. వైసీపీ ఎంపీలను రాఘురామ, స్పీకర్ రాజేంద్ర అగర్వాల్ ఆందోళన చేస్తున్న వైసీపీ ఎంపీలను శాంతింపజేసేందుకు ప్రయత్నించినా ఫలించలేదు.

ఇంతలోనే మిథున్ రెడ్డి కల్పించుకుని సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకు రఘురామ బీజేపీలో చేరేందుకు తహతహలాడుతున్నారని విమర్శించారు. ఓ దశలో రఘురామపై ఉన్న సీబీఐ కేసులపై వేగంగా దర్యాప్తు చేయాలని ఆయన కోరారు.

వైసీపీ ఎంపీలు వ్యాఖ్యలు రఘురామకు మింగుడు పడలేదు. సీఎం జగన్‌పై చాలా సీబీఐ కేసులు ఉన్నాయని, ముందు వాటి సంగతి తేల్చాలని నినాదాలు చేశారు. ఇలా మాటల యుధ్దం జరుగుతూనే ఉంది. ఆ తర్వాత పరిస్థితులు అదుపుతప్పాయి. ఇరువర్గాలకు స్పీకర్ సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు.

సమావేశానంతరం రఘురామ మీడియాతో మాట్లాడుతూ తనపై నీచమైన పదజాలం ఉపయోగించారని ఆరోపించారు. “నువ్వు మాట్లాడకురా లన్.. కొడకా... అని నలుగురు ఐదుగురు మాట్లాడరని ఆరోపించారు. ఇది ఎక్కడి సంస్కారం? అని ప్రశ్నించారు. తాను బోస డీకే అని కూడా అనలేదని, తనను పార్లమెంట్ లో లన్ ... కొడకా అంటారా రఘురామ ప్రశ్నించారు. వైసీపీ ఎంపీలకు తెలుగు, ఇంగ్లీషు లేదా మరే ఇతర భాషా తెలియదని విమర్శించారు.