Begin typing your search above and press return to search.
రఘువీరా..చెవిరెడ్డిలు 'దొంగల' వైపే మాట్లాడతారా?
By: Tupaki Desk | 8 April 2015 9:40 AM GMTతప్పు చేసిన వాళ్లను ఎవరైనా సరే ఈసడించుకుంటారు. అలాంటి వారిని సమర్థించేందుకు ఏమాత్రం ఇష్టపడరు. అలాంటిది సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడే వారికి అనుకూలంగా మాట్లాడతారా? సమస్యే లేదంటారు ఎవరైనా. కానీ..వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉంది.
శేషాచల అడవుల్లో జాతి సంపదైన ఎర్రచందనాన్ని దోచుకెళుతున్న వారిని పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేయటం ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగి.. పోలీసుల మీద పెద్ద రాళ్లు వేయటం ద్వారా పోలీసుల్ని నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు కాల్పులు జరపక తప్పని పరిస్థితి. మీద పడే రాళ్లు.. బరిసెల్ని తప్పించుకోవటానికి వారు మాత్రం ఏం చేయగలరు?
అందుకే కాల్పులు జరిపారు. ఆ కాల్పుల ఘటనలో ఇరవై మంది మరణించారు. నిజమే ఒక ఎన్‌కౌంటర్‌లో ఇరవై మంది మరణించటం ఎవరినైనా బాధ కలిగించేదే. కాకపోతే.. వారంతా అసాంఘిక కార్యకలపాలకు పాల్పడే వారన్న సంగతి మర్చిపోవద్దు. తప్పు చేసిన వారిని.. వారి వారి ఆర్థిక.. సామాజిక పరిస్థితుల ఆధారంగా వారిపై జాలి చూపటం ఏ మాత్రం క్షేమకరం కాదు.
పిచ్చి కుక్క జనాల్ని కరుస్తుంటే దాన్ని చంపకుండా.. అయ్యో పాపం కుక్కకు పిచ్చి పట్టింది. దానికి మందులిద్దాం.. నెమ్మదిగా నయం చేద్దాం. దానికి తెలీకుండా అది కరిచేస్తుంటే దాని తప్పు ఎలా అవుతుంది? అంత మాత్రం చేతనే నిండు ప్రాణాన్ని తీస్తామా? లాంటి మాటలు చెప్పగలమా? సరిగ్గా ఇలాంటి వాదనే ఉగ్రవాదుల విషయంలో కానీ.. ఎర్రచందనం దొంగల విషయంలో కానీ.
అయితే.. ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి కావొచ్చు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కావొచ్చు. ఏపీ సర్కారు తీరును ప్రశ్నించారు. ఎన్‌కౌంటర్‌ను తీవ్రంగా ఖండించారు. ఇదంతా ఏపీ సర్కారు చేసిన దారుణ చర్యగా అభివర్ణించారు. చనిపోయిన దొంగల్ని కూలీలుగా అభివర్ణించటం ఎంతవరకు సబబు అన్నది ప్రజలే ఆలోచించాలి. వీలైతే నేతల్ని నిలదీయాలి కూడా.
కూలీలు దర్జాగా కూలీ పనికి వెళతారు. అంతేకానీ.. దొంగచాటుగా వెళ్లటం.. ప్రశ్నించిన వారి ప్రాణాలు తీయాలని అనుకోరు. అలా అనుకునే వారు కూలీలు ఎంతమాత్రం కానే కాదన్న విషయం మర్చిపోకూడదు.
దొంగల్ని కూలీలుగా అభివర్ణిస్తూ మాట్లాడుతున్న నేతలు.. ఎన్‌కౌంటర్ సందర్భంగా దొంగలు జరిపిన దాడిలో గాయపడిన పది మంది పోలీసు కుటుంబాలకు వీరిద్దరూ ఏం చెబుతారు? వాళ్లు మనుషులు కారా? వారికి కుటుంబాలులేవా? కేవలం విధి నిర్వహణ కోసం వారు అన్ని దెబ్బలు తినాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ వాళ్లే కానీ లేకపోతే జాతి సంపదను కాపాడే వారు ఎవరు?
మంచి కోసం పోరాటం చేయటం.. మంచివాళ్ల సంక్షేమం కోసం ఎంతకైనా తెగించే రోజుల నుంచి దొంగలు.. స్మగ్లర్లకు అనుకూలంగా మాట్లాడే దౌర్భాగ్య రోజులు దాపురించాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రఘువీరా.. చెవిరెడ్డి లాంటి వారి నోటి నుంచి వస్తున్న రాజ్యహింస కనుక నిజంగా ఉండి ఉంటే.. వారిద్దరూ అలా మాట్లాడే ధైర్యం చేయగలరా?