Begin typing your search above and press return to search.
ప్రత్యేక హోదా ఎలా ఇవ్వొచ్చో చెప్పిన రఘువీరా
By: Tupaki Desk | 18 July 2016 9:51 AM GMT రెండేళ్లుగా ఏపీ ప్రత్యేక హోదాపై అంతా మల్లగుల్లాలు పడుతూ.. కేంద్రంతో ఘర్షణ పడుతూ.. టీడీపీని తిడుతూ ఎవరికి వారు రాజకీయంగా రఫ్పాడిస్తున్న సమయంలో ఏపీపీసీసీ అధ్యక్షుడు - మాజీ మంత్రి రఘువీరా రెడ్డి సింపుల్ సూచన చేశారు. సెంట్రల్ కేబినెట్ తీర్మానం చేస్తే ప్రత్యేక హోదా ఇచ్చేయొచ్చని.. గతంలో ఇలా రాష్ట్రాలకు కేబినెట్ తీర్మానం ద్వారానే హోదా ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అంతేకాదు.. ఆంధప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ నేతల హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా అంశం చట్టంలో చేర్చాల్సిన అవసరమే లేదని.. కేబినెట్ తీర్మానం ద్వారా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొచ్చని రఘువీరా సూచించారు. ఈ విషయంపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని.. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు - ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ చర్చకు సిద్ధమా..? అని ఆయన సవాలు విసిరారు. కాగా రఘువీరా గతంలోనూ ప్రత్యేక హోదా కోసం పోరాటాలు జరిపారు. నిత్యం ఏపీ ప్రభుత్వం - ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు కూడా ప్రత్యేక హోదాపై ప్రయివేటు బిల్లు పెట్టారు. అది కూడా ప్రత్యేక హోదా సాధనకు మంచిమార్గమే. పైగా కేవీపీ బిల్లుకు మద్దతివ్వాలని టీడీపీ కూడా నిర్ణయించడంతో ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేక హోదా అంశం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
మరోవైపు రఘువీరా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. విజయవాడలో ఆలయాల కూల్చివేతను ఖండించారు. అంతేకాదు.. ఏపీ కేబినెట్ లో సమర్థవంతమైన మంత్రులు లేరంటూ చంద్రబాబు మంత్రివర్గం గాలి తీసేశారు. మంత్రివర్గంలో సమర్థులు లేరన్న ఆయన వారి పెర్ఫార్మెన్సు బాగులేదన్నారు. దీంతో మంత్రుల పెర్ఫార్మెన్సు వెరీ పూర్(వీపీ) అంటూ రఘువీరా అన్నట్లుగా సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.