Begin typing your search above and press return to search.
'బ్రెయిన్ లెస్ పాలకుల క్యాష్ లెస్ సొసైటీ!'
By: Tupaki Desk | 14 Dec 2016 10:05 PM ISTపెద్ద నోట్ల రద్దు-తదనంతర పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి మరోమారు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ పరిణామాన్ని బ్రెయిన్ లెస్ పాలకులు చేపట్టిన క్యాష్ లెస్ సొసైటీ గా రఘువీరా అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం మూర్ఖత్వంగా అమలు చేసిన పెద్దనోట్ల రద్దుతో గత 36రోజులుగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పాలకులను ప్రశ్నించేందుకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేపడుతోందని తెలిపారు. ఈ నెల 23న రాజధాని అమరావతిలోని వెగలపూడి సెక్రటేరియేట్ వద్ద నోట్లపాట్ల బాధితులు - ఇతర ప్రజానీకంతో కలిసి ‘చలో వెలగపూడి’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు రఘువీరారెడ్డి చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో రఘువీరారెడ్డి మాట్లాడుతూ బ్రెయిన్ లెస్ పాలకులు చేపట్టిన క్యాష్ లెస్ సొసైటీ నిర్మాణ వ్యవహారంలో బీజేపీ-టీడీపీ కుమ్మక్కైనట్టు స్పష్టమవుతోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో అధికార బీజేపీ-టీడీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు - ప్రజాసంఘాల నేతలు తమ ఆందోళనలో పాల్గొంటారని తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల లావాదేవీలకు సర్వీస్ చార్జ్ రూపంలో వసూలవుతున్న సుమారు లక్షా 50వేల కోట్ల రూపాయల జమా ఖర్చుల వివరాలను ప్రకటించాలని రఘువీరా డిమాండ్ చేశారు.
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో తలెత్తిన ఒత్తిళ్లకు దేశంలో ఇప్పటికి సుమారు 110 మంది సామాన్యులు - 12 మంది బ్యాంక్ ఉద్యోగులు మృతి చెందారని వీరి మృతికి ప్రధాని మోదీ బాధ్యత వహిస్తారా? అని రఘువీరా రెడ్డి ప్రశ్నించారు. సామాన్యుల ఇళ్లలో పెళ్లిళ్లు వాయిదా పడ్డాయే కాని బీజేపీ నేతలు - మంత్రుల ఇళ్లల్లో మాత్రం వందల కోట్ల రూపాయల వ్యయంతో ఘనంగా పెళ్లిళ్లు జరిగాయని ఆయన విమర్శించారు. మోదీకి మానవ హక్కులపై - ప్రజాస్వామ్యంపై ఎప్పుడూ నమ్మకం లేదని - తానేదో రాచరికంలో ఉన్నానని భావిస్తూ నియంతలా వ్యవహరిస్తున్నారని రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. నోట్ల రద్దు వెనుక ఎంతటి భారీ కుంభకోణం ఉందో త్వరలో బయటపడుతుందన్నారు. ఇందులో చంద్రబాబు పాత్ర, ఆయన భయం ఏమిటో కూడా బయటకు వస్తుందన్నారు. వివిధ వర్గాల అభిప్రాయాలపై ఇక ప్రజా ఉద్యమాన్ని చేపడతామని రఘువీరారెడ్డి వివరించారు. పార్లమెంట్ ఉభయ సభల్లో సమాధానం చెప్పలేక ప్రధాని నరేంద్ర మోదీ తప్పించుకుంటున్నారని విమర్శించారు. పార్లమెంట్ మెట్లను ముద్దాడినంత మాత్రాన గౌరవం పెరగదని, చట్టసభలో సభ్యుల ప్రశ్నలకు వివరణ ఇస్తే గౌరవంతో పాటు ప్రతిష్ఠ కూడా పెరుగుతుందనే విషయాన్ని మోదీ గుర్తించాలన్నారు. నోటుపాట్లపై కాంగ్రెస్ రూపొందించిన నివేదికను ఉభయ సభల కాంగ్రెస్ నేతలకు అందించామన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/