Begin typing your search above and press return to search.
చంద్రబాబుకు కొత్త బిరుదు
By: Tupaki Desk | 22 Dec 2016 11:35 AM ISTచంద్రబాబుకు ఎన్నో బిరుదులు.. ఎన్నో రాజకీయ ముద్దు పేర్లు. అన్నిట్లోనూ హైటెక్ చంద్రబాబు అనే పేరు ఆయనకు చాలా ఇష్టం. అయితే... విపక్ష నేతలు - ఆయన రాజకీయ ప్రత్యర్థులు మాత్రం చంద్రబాబుకు ఎప్పటికప్పుడు కొత్త బిరుదులు ప్రదానం చేస్తుంటారు. అవేమీ ఆయనకు నచ్చవట. తాజాగా పీసీసీ ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి కూడా చంద్రబాబు పేరు ముందు కొత్త విశ్లేషణ జోడించారు. ఉత్తమ అవకాశవాది అని ఆయన చంద్రబాబుకు కొత్త పేరు పెట్టారు.
దేశంలోని అందరు ముఖ్యమంత్రుల్లోనూ ఉత్తమ అవకాశవాది ఏపీ సీఎం చంద్రబాబేనని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. పెద్దనోట్ల రద్దు అనంతరం పరిణామాలపై కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ ‘చలో వెలగపూడి- ప్రశ్నిద్దాం రండి’ పేరుతో ప్రజాధర్నా నిర్వహించనున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ... ప్రధాని మోదీ - కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ - ఏపీ సీఎం చంద్రబాబు ఈ విషయమై రోజుకో మాట - పూటకో ఉత్తర్వులు ఇస్తున్నారని విమర్శించారు. చంద్రబాబును మించిన అవకాశవాది లేరని అన్నారు.
మోడీ, చంద్రబాబు ప్రభుత్వాల తీరు సర్కస్ కంపెనీని తలపిస్తోందని... ప్రధాని మోదీ - సీఎం చంద్రబాబు సర్కస్ కంపెనీ పెట్టుకుంటే మంచిదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా - నోట్ల రద్దు విషయంలో చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారని విమర్శించారు. మోదీ పిచ్చి తుగ్లక్ పాలనలో బాబు ప్రధాన భాగస్వామి అని, చంద్రబాబు రెండున్నరేళ్ల పాలన పూర్తి అవినీతిమయమని మండిపడ్డారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/