Begin typing your search above and press return to search.
బాబు గారూ...రఘువీరా కామెంట్స్ విన్నారా?
By: Tupaki Desk | 23 Jan 2017 10:18 AM ISTరాజధాని కూడా లేకుండా ఏర్పాటైన నవ్యాంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంగా సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్లుగా పర్యటనలు సాగిస్తున్నారు. ఇటు దేశ రాజధాని ఢిల్లీతో పాటు అటు... పలు దేశాలకు ఆయన వెళుతున్నారు. ఆయా దేశాల పర్యటనల్లో భాగంగా ఆయన అక్కడి పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సదరు పారిశ్రామికవేత్తల నుంచి భారీ ఎత్తున హామీలు లభిస్తున్నాయని - రాష్ట్రానికి తాము ఆశించిన దాని కంటే కూడా ఎక్కువగానే పెట్టుబడులు వచ్చే అవకాశాలున్నాయని టీడీపీ సర్కారు చెబుతోంది. అయితే ఇప్పటిదాకా ఎంత మేర విదేశీ పెట్టుబడులు వచ్చాయన్న విషయాన్ని మాత్రం ప్రభుత్వం ఇప్పటిదాకా బయటపెట్టలేదనే చెప్పాలి.
ఇదే అంశాన్ని ఆసరా చేసుకుని విపక్షాలు టీడీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఇటీవలే దావోస్ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు ఆ పర్యటనను ముగించుకుని నిన్ననే తిరిగి వచ్చారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి నిన్న చంద్రబాబు పర్యటనలపై నిప్పులు చెరిగారు. అనంతపురం జిల్లా మడకశిరలో నిన్న మీడియాతో మాట్లాడిన రఘువీరా... చంద్రబాబు సర్కారుపై సూటి ప్రశ్నలే సంధించారు. పెట్టుబడుల ఆకర్షణ కోసం కాకుండా... కేవలం టైంపాస్ కోసమే చంద్రబాబు విదేశీ పర్యటనలకు వెళుతున్నారని కూడా రఘువీరా ఘాటు వ్యాఖ్యలే చేశారు.
చంద్రబాబు విదేశీ పర్యటనలు టైంపాస్ పర్యటనలు కాకుంటే... తాను కోరిన మేరకు వివరాలు వెల్లడించాలని ఆయన ఏకంగా సవాలే విసిరారు. అసలు ఇప్పటిదాకా రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు ఎంతమేర వచ్చాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా ఆయన కోరారు. చంద్రబాబు విదేశీ పర్యటనల కారణంగా ఇప్పటిదాకా రాష్ట్రానికి చిల్లిగవ్వ పెట్టుబడులు కూడా రాలేదని ధ్వజమెత్తారు. మరి రఘువీరా ప్రశ్నలకు టీడీపీ సర్కారు ఏ మేర స్పందిస్తుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/