Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ లో ఆయ‌న ఒక్క‌డి వెంటే రెండుకోట్ల మంది

By:  Tupaki Desk   |   25 Feb 2017 5:27 AM GMT
కాంగ్రెస్ లో ఆయ‌న ఒక్క‌డి వెంటే రెండుకోట్ల మంది
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకీ బ‌ల‌హీన ప‌డుతున్న‌ప్ప‌టికీ పీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరా రెడ్డి మాత్రం హ‌స్తం పార్టీని పైకి లేపేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఒక‌వైపు ఇలా ప్ర‌య‌త్నం కొన‌సాగిస్తున్న‌ప్ప‌టికీ మ‌రోవైపు మెజార్టీ నేత‌లు పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. అయిన‌ప్ప‌టికీ త‌న ఆశ వ‌దులుకొని ర‌ఘువీరా భారీ ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నారు. తాజాగా ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఆయ‌న ఇలాంటి కామెంట్ ఒక‌టి వ‌దిలారు. ప్రత్యేక హోదా కోసం రెండు కోట్ల మందితో ఈనెల 26వ తేదీ ప్రజాబ్యాలెట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రఘువీరారెడ్డి తెలిపారు.

2017 సంవత్సరాన్ని ఉద్యమ నామసంవత్సరంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని ర‌ఘువీరా తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు మేలు చేసే ప్ర‌జా బ్యాలెట్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో ప్రత్యేక హోదా కోసం రైతు ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు. హోదా రావడం వల్ల యువతకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయన్న అంశాలపై చైతన్యవంతులను చేసే తాము చేపట్టే ఉద్యమాల్లో స్వచ్ఛందంగా పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నట్లు ర‌ఘువీరా తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు, ఎక్కడ జరిగినా స్థానిక సమస్యలపైనే ప్రభావితం చేసి అక్కడి నేతలను గెలిపిస్తారని, అలాంటి ఎన్నికలకు ఎంపీ - ఎమ్మెల్యేల ఎన్నికలతో ఎలాంటి సంబంధం ఉండదన్నారు. పంజాబ్ - ఉత్తర్‌ ప్రదేశ్ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటమి ఖాయమని రఘువీరారెడ్డి జోస్యం చెప్పారు. ప్రధాని ఎన్ని హామీలు ఇచ్చినా అక్కడి ప్రజలకు పార్టీపై విశ్వాసం లేదన్నారు. ఓటమి తప్పదన్నారు. ఇప్పటికైనా బిజెపి గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే తగిన గుణపాఠం తప్పదని ర‌ఘువీరా జోస్యం చెప్పారు.

పార్టీ నేత‌ల్లో సీనియ‌ర్ల నుంచి మొద‌లుకొని జూనియ‌ర్ల వ‌ర‌కు అంతా త‌మ సొంత దారి చూసుకుంటున్న‌ప్ప‌టికీ..రెండు కోట్ల మందితో ప్ర‌జా బ్యాలెట్ నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించ‌డం ర‌ఘువీరారెడ్డి ధైర్యానికి నిద‌ర్శ‌న‌మ‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ర‌ఘువీరా అంచ‌నా వేసుకున్న‌ రెండు కోట్ల మంది హాజ‌ర‌వుతారా అంటే మాత్రం.. సందేహమేన‌ని చెప్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/