Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు కాంగ్రెస్ ఆఫర్.. కలిసొస్తారా?

By:  Tupaki Desk   |   1 May 2019 5:36 AM GMT
కేసీఆర్ కు కాంగ్రెస్ ఆఫర్.. కలిసొస్తారా?
X
వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వాలని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ను కోరారు. ఈ మేరకు కేసీఆర్ కు లేఖ రాశారు.

కేంద్రంలోని బీజేపీ ఎస్సీ వర్గీకరణ చేయడానికి ఒప్పుకోలేదని.. అలాగే ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వడానికి కూడా అంగీకరించలేదని.. అందుకే ఈ రెండింటికి మద్దతు తెలిపిన కాంగ్రెస్ కు వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో సపోర్ట్ చేయాలని రఘువీరారెడ్డి లేఖలో కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని.. ఆయనకు సపోర్ట్ గా నిలవాలని సూచించారు.

కేంద్రంలో వచ్చే ఎన్నికల్లో ఏదైనా జరగొచ్చని.. తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మా పార్టీకి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ తరుఫున కోరుతున్నానని లేఖలో రఘువీరా పేర్కొన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఆ పార్టీని ఓడించే గడిచిన ఎన్నికల్లో కేసీఆర్ ఓడించాడు. ఇప్పుడు బీజేపీకి మద్దతుదారుగా ఉన్నారన్న ఊహాగానాలున్నాయి. ఈనేపథ్యంలోనే కేంద్రంలో ఏ పార్టీకి మెజార్టీ రాక కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు వస్తే కేసీఆర్ లాంటి ప్రాంతీయ పార్టీల మద్దతు అవసరం ఉంటుంది. అందుకే రఘువీరాతో కాంగ్రెస్ ఈ ఎత్తుగడ వేసినట్లు అర్థమవుతోంది.

అయితే గతంలో కాంగ్రెస్ తో పోత్తు పెట్టుకొని.. యూపీఏలో కేంద్రమంత్రిగా కొనసాగిన కేసీఆర్ ఎన్నికల తర్వాత పరిణామాలను బట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడానికి వెనుకాడరన్న చర్చ సాగుతోంది. అందుకే ముందస్తుగా కాంగ్రెస్ ఈ ఎత్తుగడ వేసినట్లు సమాచారం. మరి కేసీఆర్ ఈ ఆఫర్ ను ఎలా తీసుకుంటాడో చూడాలి.