Begin typing your search above and press return to search.
బస్సెక్కుతున్న కాంగ్రెస్
By: Tupaki Desk | 30 Nov 2016 6:28 AM GMTతెలంగాణలో కాంగ్రెస్ నేతలు కారెక్కుతుంటే ఏపీలోని కాంగ్రెస్ నేతలు బస్సెక్కుతున్నారు. ఇదేంటిది.. కారంటే టీఆరెస్.. మరి బస్సు గుర్తుపార్టీ ఎక్కడుంది అనుకోవద్దు. ఏపీ కాంగ్రెస్ నేతలేమీ పార్టీలు మారడం లేదు. ఇప్పటికే మారిపోవడంతో వారికి ఇప్పుడు అలాంటి అవసరం లేదు. అందుకే.. ఉన్న ఒకరద్దరు నేతలు చంద్రబాబుకు వ్యతిరేకంగా యాత్ర చేయడానికి బస్సు ఎక్కుతున్నారు.
రాష్ట్రంలో నిరాశా నిస్పృహతో ఉన్న శ్రేణుల్లో ఉత్సాహం తీసుకురావడంతోపాటు, నేతలను కదిలించేందుకు పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల ముందు బస్సుయాత్ర నిర్వహించిన నాయకత్వం మళ్లీ ఇప్పుడు కూడా రాష్టవ్య్రాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఏఐసిసి నుంచి ఇద్దరు ప్రధాన కార్యదర్శులను యాత్ర ఆసాంతం ఉండేలా చూడటం ద్వారా - నిస్తేజంగా ఉన్న నేతల్లోనూ కదలిక తీసుకురావాలన్న లక్ష్యంతో రఘువీరారెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. పార్టీ అధికారం కోల్పోయిన నాటి నుంచి ఏదో ఒక పేరుతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ, కార్యకర్తల్లో నైతిక స్థైర్యం దెబ్బతినకుండా చూస్తున్న రఘువీరా ఇప్పుడు కూడా అలాంటి మరో ప్రయత్నం చేస్తున్నారు. మంగళవారం విజయవాడలో తనను కలసిన సీనియర్లతో సమీక్ష నిర్వహించిన అనంతరం వారి సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
డిసెంబర్ మొదటి వారం నుంచి జనవరి మూడవ వారం వరకూ బస్సు యాత్ర నిర్వహించనున్నారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయని వైనం - రుణమాఫీతో రైతులను - ఉద్యోగాల కల్పన పేరుతో నిరుద్యోగులను, రుణాల రద్దుతో డ్వాక్రా మహిళలను మోసం చేసిన వైనాన్ని వివరిస్తూ కాంగ్రెస్ ప్రజాపోరుబాట పేరుతో బస్సుయాత్రకు సిద్ధమవుతోంది. ఇందులో ఏఐసిసి ప్రధాన కార్యదర్శులయిన దిగ్విజయ్ సింగ్ - గులాంనబీఆజాద్ కూడా వంతుల వారీగా నిరంతరం యాత్రలోనే కొనసాగుతారని, నలుగురు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కూడా ఈ యాత్రలో ఉంటారని సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/