Begin typing your search above and press return to search.
రఘువీరా సరిగా అప్ డేట్ అవుతున్నారా?
By: Tupaki Desk | 20 May 2016 9:22 AM GMTకొద్దిరోజులుగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చోటు చేసుకున్న మార్పులు.. మీడియాలో వార్తలుగా వస్తున్న సంగతి తెలిసిందే. యువరాజు రాహుల్ మీద బోలెడన్ని ఆశలు పెట్టుకున్నా అవన్నీ అడియాసలు కావటం.. అయ్యగారి వల్ల కించిత్ ప్రయోజనం లేకపోవటాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తిస్తున్నారు. అందుకే.. పార్టీకి కొత్త ఉత్సాహం తేవాలన్న తహతహ ఈ మద్యన మరీ మరీ పెరిగింది. దీనికి తగ్గట్లే.. గడిచిన రెండు వారాలుగా మీడియాలో క్రమం తప్పకుండా ప్రియాంక గాంధీకి చెందిన వార్తలు రావటం గమనార్హం.
యూపీ సీఎం అభ్యర్థిగా ఆమెను ప్రకటించాలని కొందరు.. పార్టీలో కీలకమైన స్థానాన్ని ఇవ్వాలని మరికొందరు.. ఏతావాతా ఇప్పటివరకూ ఇంటికే పరిమితమైన ప్రియాంకను.. తెర మీదకు తీసుకురావాలని.. ఆమె బొమ్మతో మేజిక్ చేయాలన్న ఆలోచన కనిపిస్తోంది. దీనికి తగ్గట్లే ప్రియాంక నానమ్మ ఇందిరతో పోల్చటం.. రూపంలోనే కాదు.. శక్తిసామర్థ్యాల విషయంలోనూ ఇందిరకు తగ్గట్లే ఉంటుందన్న కొత్త రాగం వినిపిస్తోంది.
ఊరంతా ఒక దారి అయితే.. ఉలిపికట్టది మరో దారి అన్నచందంగా.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతలంతా ప్రియాంకమ్మ రాగం తీస్తుంటే.. ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరా మాత్రం రాహుల్ రాగం తీయటం గమనార్హం. తాజాగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ త్వరలో బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పుకొచ్చారు. రాహుల్ కు పార్టీ సారథ్యం ఎప్పుడన్న మాటకు కాంగ్రెస్ సీనియర్ నేతలు మాట దాటేస్తుంటే.. దానికి భిన్నంగా రఘువీరా మాత్రం రేపో.. ఎల్లుండో రాహుల్ కు కొత్త బాధ్యతలు ఇస్తున్నట్లుగా మాట్లాడటం చూస్తే.. రఘువీరా సరిగా అప్ డేట్ కావటం లేదనిపిస్తోంది.