Begin typing your search above and press return to search.

లోకేష్‌ కు ఎర్త్‌ పెట్టారా?

By:  Tupaki Desk   |   26 May 2015 4:54 AM GMT
లోకేష్‌ కు ఎర్త్‌ పెట్టారా?
X
తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నవ్యాంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి తనదైన శైలిలో ప్రణాళికలు రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాగంగా పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని''సన్‌రైజ్‌ స్టేట్‌'' అని ప్రమోట్‌ చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్‌ నేతలు తమదైన శైలిలో ఎద్దేవా చేశారు.

రాష్ట్రాన్ని సన్‌రైజ్‌ స్టేట్‌గా తరచూ చంద్రబాబు అభివర్ణిస్తుంటే ''సూర్యోదయ రాష్ట్రం''గా భావిస్తూ వచ్చామని.. కాని సన్‌ అంటే 'ఎస్‌యుఎన్‌' కాదని.. 'ఎస్‌ఓఎన్‌' అని తమకు ఈ మధ్యనే అర్థమైందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరా రెడ్డి వ్యాఖ్యానించారు. 'సన్‌ రైజ్‌ అంటే సూర్యోదయం కాదు. చంద్రబాబు కుమారుడు లోకేశ్‌ వృద్ధి. లోకేష్‌ ఆర్థికంగా వృద్ధిలోకి రావడమే సన్‌ రైజ్‌కు అర్థం' అని అన్నారు. చంద్రబాబు కుమారుడు లోకేష్‌ ను ఎన్టీఆర్‌ భవన్‌లో కలిసి సూట్‌కేసులు ఇస్తేనే తర్వాత సచివాలయంలో పనులు అవుతున్నాయని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై మంగళవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని రఘువీరా చెప్పారు. ప్రత్యేకహోదా సాధన కోసం సీఎం చంద్రబాబు చొరవ చూపడం లేదని విమర్శించారు. హోటల్‌లో ఒక్కో దానికి ఒక్కో ధర అన్నట్లు చంద్రబాబు సర్కారులో అన్ని పనులకూ రేట్‌ ట్యాగ్‌లు పెట్టేశారని, వ్యవస్థలను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్‌ మంత్రి పేషీలోనే బదిలీల అక్రమాలు జరుగుతున్నాయని, మంత్రి మాత్రం తనకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.


కేంద్రం, రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పడి ఏడాది అయినా ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదని రఘువీరా అన్నారు. ఈ ఏడాది పాలనలో రైతులు, మహిళలు, కార్మికులు, యువత అందరూ దగా పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు సమయం ఉన్నప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ ఓ వైపు అమిత్‌షా చెబుతుంటే.. మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అరÛత లేదని వెంకయ్య నాయుడు అంటున్నారని ప్రస్తావించారు. టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులు అశోక్‌ గజపతి రాజు, సుజనా చౌదరి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు.


మొత్తం మీద బాబును. చినబాబును వదలకుండా ఈ మధ్య వరుసగా విమర్శలు గుప్పించడంలో రఘువీరా ముందుటున్నారు. పైగా ముగ్గులోకి లోకేష్‌ ను కూడా లాగుతున్నారు